ఉద్యమం ఇంతేనా అని డౌట్: కెసిఆర్‌కు చాడ కౌంటర్

ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కెసిఆర్ మాట్లాడటం దారుణమని చాడ విమర్శించారు. గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టగలవారికే అవకాశమని బహిరంగంగా చెప్పడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేలా వ్యవహరిస్తూ తెలంగాణ ఏర్పాటుపై కేసీఆర్ చిత్తశుద్ధి చూపడంలేదన్నారు.
పైగా 50 శాతం ఓట్లు తమకు వచ్చే అవకాశముందని, మిగతా 50శాతం అన్ని పార్టీ లు పంచుకుంటాయని చెప్పడమూ విడ్డూరమన్నారు. ఆయన వాఖ్యలు చూస్తుంటే తెలంగాణ ఉద్యమం కేవలం 50 శాతం మాత్రమే ఉందా.. అనే అనుమానం కలుగుతోందన్నారు.
కెసిఆర్ ఒంటెత్తు పోకడలు మాని అందరితో కలిసి రాష్ట్ర సాధనకు కృషి చేయాలే తప్ప రాజకీయ ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని వాడుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా సర్వం తానేననే అహంభావం వదిలి, రాష్ట్ర సాధనకు పనిచేస్తున్న అన్ని శక్తులను కలుపుకొని పోతే మంచిదని సూచించారు. లేదంటే రాష్ట్ర ఏర్పాటు జఠిలమవుతుందన్నారు.












Click it and Unblock the Notifications