రేప్ విక్టింని పెళ్లాడిన ఫ్రెండ్, బాలికపై స్నేహితుడి ఘోరం

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి బాధితురాలిని ఆమె స్నేహితుడు ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. తొలుత కోర్టులో పెళ్లి చేసుకొని తర్వాత యువతి తండ్రి, బంధువులు, స్థానికుల సమక్షంలో గుడిలో వివాహం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. బాధిత స్నేహితురాలికి అండగా నిలిచాడు.
నాగపూర్‌లో ఘోరం
ఏడో తరగతి చదువుతున్న ఓ బాలిక పుట్టిన రోజు నాడే ఆమెపై సామూహిక అత్యాచారం చేసి సజీవ దహనం చేసిన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. స్నేహితుడని నమ్మి.. అతను చెప్పినట్లు రహస్యంగా పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న సమయంలో ఇది జరిగింది.
పుట్టిన రోజు వేడుకలో స్నేహితుడు, మరికొందరు కలిసి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. ఆపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన బయటకు తెలియకుండా ఉండేందుకు ఆమెపై కిరోసిన్ పోసీ సజీవ దహనం చేశారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం నాగపూర్‌లో జరిగింది.












Click it and Unblock the Notifications