అభయ కేసులో నగర యువతి కీలకం: లింకులపై ఆరా

ఆయనకు చెందిన ఆస్తులు బినామీల పేరు పైన కూడా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా తెలుస్తోంది. అభయ గోల్డ్ కేసును ఛేదించేందుకు ఆరు ప్రత్యేక పోలీసు టీంలు రంగంలోకి దిగాయి. 510 ఎకరాలకు సంబంధించి 64 డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇందుకు సంబంధించిన భూలావాదేవీలను నిలిపి వేయాలని 30 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 62,500 మంది నుండి అతను డబ్బులు వసూలు చేసినట్లుగా గుర్తించారు. అభయ గోల్డ్‌తో పాటు శ్రీనివాస్ పేరున 22 కార్లు ఉన్నట్లుగా గుర్తించారు.
హైదరాబాదు యువతితో సంబంధాలపై ఆరా
శ్రీనివాస్ హైదరాబాదులోని ఓ యువతి పేరున భారీగా ఆస్తులు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. ఆమె పేరు వినూత్నగా గుర్తించినట్లు సమాచారం. శ్రీనివాస్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆ హైదరాబాద్ యువతి వినూత్న ఇప్పుడు కేసులో కీలకంగా మారిందని సమాచారం. రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడలోని వినూత్న ఇంటిలో ఇప్పటికే దాడులు నిర్వహించారు. ఆమెకు శ్రీనివాస్‌తో గల సంబంధాలపై ఆరా తీస్తున్నారు. వినూత్న కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా శ్రీనివాస్‌ను పోలీసులు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు.












Click it and Unblock the Notifications