గురునాథ్‌పై బావమరిది సంచలనం: చిక్కుల్లో శ్రీశాంత్

Gurunath Meiyappan
ముంబై: ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్టైన గురునాథ్ మియప్పన్ పైన ఆయన బిసిసిఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ తనయుడు యోగేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురునాథ్‌కు బెట్టింగ్, బుకీలతో సంబంధాలు కొత్త కాదని, భారత బుకీలతోనే కాకుండా దుబాయ్ బుకీలతోను సంబంధాలున్నాయన్నాడు. గురునాథ్‌కు చెన్నై, దుబాయ్ బుకీలతో సంబంధాలున్నాయని, ఐపిఎల్ ఆరంభం నుంచి అతడు వారితో చర్చలు సాగిస్తున్నాడని చెప్పాడట.

మొదట నెమ్మదిగా మొదలైన అతడి బెట్టింగ్ వ్యాపారం... ఇప్పుడు అభివృద్ధి చెందిందని, తనను తన కుటుంబానికి దూరం చేస్తున్నాడని ఆరోపించినట్లుగా వార్తలు వచ్చాయి. గురునాథ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచుల పైనబెట్టింగ్స్ కట్టాడని అరెస్టైన బాలీవుడ్ నటుడు విందూ చెప్పాడట.

తండ్రి పైనా...

తన తండ్రి కావాలంటే పెద్ద విమానం కొనుక్కోగలడని, కానీ చిన్న దాంతోనే సరిపెట్టుకుంటునన్నాడని, విదేశాలకు వెళితే విమానంలో ఇంధనం కోసం నాలుగు గంటల పాటు దుబాయ్‌లో ఆగుతాడని, అతడు ఎందుకు అలా చేస్తున్నాడో.. ఎవరితో మాట్లాడుతున్నాడో, చిన్ విమానంతోనే ఎందుకు సరిపెట్టుకుంటున్నాడో అని కూడా వ్యాఖ్యానించినట్లుగా వార్త వచ్చింది.

గురునాథ్ సస్పెన్షన్

చెన్నై సూపర్ కింగ్స్ గౌరవ సభ్యుడు గురునాథ్‌ను బిసిసిఐ ఆదివారం సస్పెండ్ చేసింది.

కాగా, స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన శ్రీశాంత్ మరిన్ని చిక్కుల్లో పడ్డట్లుగా కనిపిస్తోంది. అతడు ఓ హోటల్‌లో బుకీలను కలిసినట్లుగా విజువల్స్‌లో పోలీసులకు దొరికినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+