క్రికెటర్లకు విందూ సింగ్ అమ్మాయిలను ఎర వేశాడా?

ముంబై: బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన బాలీవుడ్ నటుడు విందూ దారాసింగ్‌కు సంబంధించి పోలీసులకు ఓ సిసిటీవి ఫుటేజ్ లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ సిసిటివీ ఫుటేజ్‌లోని దృశ్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నట్లు సమాచారం. ఫిక్సింగ్ కోసం ఉసిగొల్పడానికి విందూ దారా సింగ్ క్రికెటర్లకు హై ప్రోఫైల్ మోడల్స్‌ను, ఎస్కార్ట్స్‌ను, యువతులను సరఫరా చేసేవాడని పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.

పవన్ అనే బుకీతో విందూ దారా సింగ్‌కు సంబంధాలున్నట్లు చెబుతున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ క్రికెటర్ క్రిస్ గేల్‌కు పవన్ 4.5 లక్షల రూపాయల విలువ చేసే బంగారం గొలుసును బహుమతిగా ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

Vindoo Dara Sing

కళంకిత పాకిస్తాన్ అంపైర్ అసద్ రవూఫ్‌కు విందూ దారా సింగ్ అమ్మాయిలను సరఫరా చేసినట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఆరోపణలు రుజువైతే విందూ దారాసింగ్‌కు కఠినమైన శిక్ష పడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. సెక్స్ రాకెట్‌తో సంబంధాలపై ఆయనపై అభియోగాలు మోపే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. విందూ దారాసింగ్ పోలీసుల విచారణలో బిసిసిఐ చీఫ్ గురునాథ్ మేయప్పన్ పేరు చెప్పాడు.

ఇదిలావుంటే, విందూ దారా సింగ్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దారాసింగ్ పోలీసు కస్టడీని ఈ నెల 31వ తేదీ వరకు పొడగిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, బెట్టింగ్ వ్యవహారంలో అరెస్టయిన గురునాథ్ మేయప్పన్ నివాసంలో మరోసారి మంగళవారం సోదాలు జరిగాయి.

గురునాథ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సంబంధం లేదని వాదిస్తున్న నేపథ్యంలో ఆయనకు జట్టుతో, ఫిక్సింగ్ వ్యవహారంతో సంబంధం ఉందని నిరూపించే సాక్ష్యాల కోసం పోలీసులు చెన్నైలోని గురునాథ్ నివాసంలో సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం జరిపిన సోదాల్లో పోలీసులు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+