మోహన్‌బాబు, బ్రహ్మీ పని లేని నటులా: టిఎస్సార్

 Daggubati Venkateswar Rao - T Subbirami Reddy
హైదరాబాద్: విశాఖపట్నం పార్లమెంటు సీటు విషయంలో కాంగ్రెసు పార్టీలో దగ్గుబాటి దంపతులకు, టి. సుబ్బిరామిరెడ్డికి మధ్య వివాదం ముదురుతోంది. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెసు శాసనసభ్యుడు, కేంద్ర మంత్రి పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావుపై సుబ్బిరామిరెడ్డి బుధవారం తీవ్రంగా మండిపడ్డారు. అక్కినేని నాగేశ్వర రావు, మోహన్ బాబు, బ్రహ్మానందం పనిలేని నటులా అని ఆయన దగ్గుబాటి వెంకటేశ్వర రావును అడిగారు.

పని లేని నటులను సన్మానిస్తుంటారని దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యపై సుబ్బిరామిరెడ్డి ఆ ప్రశ్న వేశారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. పురంధేశ్వరిని చూసి సంయమనం పాటించడం దగ్గుబాటి వెంకటేశ్వర రావు నేర్చుకోవాలని ఆయన అన్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీపై నిర్ణయాన్ని కాంగ్రెసు అధిష్టానానికే వదిలేస్తున్నానని ఆయన చెప్పారు. అయితే, విశాఖపట్నం పార్లమెంటు సీటు తనదేనని ఆయన అన్నారు. నర్సారావుపేట, లేదా ఒంగోలు నుంచి పోటీ చేయాలని పురంధేశ్వరికి తానే సూచించినట్లు ఆయన తెలిపారు. విశాఖపట్నం సీటు నుంచి తానేతేనే గెలుస్తానని, పురంధేశ్వరి ఓడిపోతారని ఆయన అన్నారు.

విశాఖపట్నానికి తూర్పు ఎటో, పడమర ఎటో కూడా దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు తెలియదని టిఎస్సార్ వ్యాఖ్యానించారు. దగ్గుబాటి వెంకటేశ్వర రావు చేసిన ఆరోపణలు అవాస్తవమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+