నిత్యానంద లీలలు: స్వామి కోసం విడాకులకై భార్య పట్టు

Nityananda Swamy
హైదరాబాద్: రాసలీలల నిత్యానంద స్వామి భక్తి పారవశ్యంలో ఓ మహిళ ఏకంగా విడాకులు కోరిన సంఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు ఇద్దరు వైద్యులే. 13 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అమెరికాలో స్థిరపడ్డారు. ఇద్దరు పిల్లలు. ఏ చింతా లేదు. అయితే ఇటీవల అకస్మాత్తుగా భార్య తనకు ఈ మొగుడు వద్దని, విడాకులు ఇప్పించాలని, లేదంటే అతడిని జైలులో పెట్టాలని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించింది.

ఆమెలో అంతటి మార్పుకు కారణం రాసలీలల నిత్యానంద స్వామి ఆశ్రమమని తేలిందట. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో ఉంటున్న కుటుంబ సభ్యుల వద్దకు కొద్ది రోజుల క్రితం ఈ వైద్య దంపతులు వచ్చారు. ఈ సమయంలో స్నేహితురాలి ద్వారా ఆమె నిత్యానందుని గురించి విన్నది. కొద్దికాలానికే భక్తురాలిగా మారిపోయింది.

ఆశ్రమంలో భాగంగా నిర్వహిస్తున్న స్కూలులో పిల్లలను చేర్పించింది. దీనిపై ఇంట్లో కొద్దిగా గొడవ జరిగింది. ఆశ్రమానికి వెళ్లొద్దని ఆమె తల్లిదండ్రులు, భర్త వారించారు. కానీ ఆమె అంగీకరించలేదు. ఆశ్రమంలోనే ఉండిపోతానని మొండికేసింది. దీనిపై ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. చివరకు అవి బజారున పడ్డాయి.

తాజాగా ఆమె హైదరాబాద్ సిసిఎస్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో భర్తపై ఫిర్యాదు చేసింది. భార్యాభర్తలను కౌన్సెలింగ్ చేయగా, భర్త తప్పేమీ లేదని తేలింది. "మీరూ నిత్యానందుని సేవలో తరించండి'' అని కౌన్సెలింగ్ సమయంలో ఏకంగా డిసిపికే ఆమె సూచించారు. ఏదోలా సర్దిచెప్పి వారిని ఇంటికి పంపేసరికి పోలీసుల తలప్రాణం తోకకు వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+