• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాధిస్తోంది: అస్త్ర సన్యాసంపై అద్వానీ, రిజైన్ తిరస్కరణ

By Srinivas
|

LK Advani
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలోని ప్రస్తుత విధానాల పట్ల తాను సంతృప్తి చెందలేకపోతున్నానని ఆ పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ సోమవారం అన్నారు. అద్వానీ పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన ఓ నోట్ విడుదల చేశారు. తాను ప్రస్తుత పార్టీ విధానాలపై ఏమాత్రం సంతృప్తిగా లేనని చెప్పారు. పార్టీ ఒకప్పటిలా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఇక నుండి పార్టీలో సాధారణ కార్యకర్తలా పని చేస్తానని అన్నారు. పార్టీలో కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మధ్య కొందరు వ్యక్తిగత అజెండాతో పని చేయడం బాధిస్తోందన్నారు. ప్రస్తుతం పార్టీ తీరుతో సర్దుకుపోలేకపోతున్నానన్నారు. తొలితరం నేతల ఆశయాలు పార్టీలో ఇప్పుడు కొనసాగడం లేదన్నారు. దీనదయాళ్, నానాజీ, అటల్ బిహారీ వాజపేయిలు నిర్మించిన పార్టీలా లేదన్నారు. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వంటి తొలి తరం నేతల ఆశయాలు పార్టీలో కొనసాగడం లేదన్నారు.

అద్వానీ రాజీనామా లేఖ పూర్తి పాఠం....

ప్రియమైన పార్టీ అధ్యక్షులు రాజ్‌నాథ్ సింగ్‌జీ

నా రాజకీయ జీవితమంతా జన సంఘ్, భారతీయ జనతా పార్టీ కోసమే పని చేశా. అందుకు నేను గర్వపడుతున్నా. ఇది నాకు సంతృప్తినిచ్చింది. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న విధానాలపై సర్దుకుపోలేకపోతున్నాను. పార్టీ ఏ దిశలో వెళ్తుందో అర్థం కావడం లేదు. నేతల ఆశయాలు కొనసాగడం లేదు.

డాక్టర్ ముఖర్జీ, దీన్ దయాళ్, నానాజీ, వాజపేయిల ఆశయాలు కనిపించడం లేదు. వారు దేశం కోసం పరితపించారు. ప్రస్తుతం ఎక్కువ మంది నాయకులు వ్యక్తిగత అజెండా కోసమే పని చేస్తున్నారు. పార్టీలో జాతీయ కార్యవర్గం, పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల సంఘ కమిటీ పదవులకు రాజీనామా చేస్తున్నానను. దీన్నే రాజీనామాగా భావించి ఆమోదించగలరు.

ఇట్లు మీ భవదీయుడు అద్వానీ.

బుజ్జగింపులు

అద్వానీని బుజ్జగించే పనిలో బిజెపి అధిష్టానం, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు పడ్డారు. రాజీనామా నేపథ్యంలో ఆయన ఇంటికి భారీగా కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. కాగా, అద్వానీ రాజీనామను రాజ్‌నాథ్ సింగ్ తిరక్సరించారు. అద్వానీ రాజీనామా బాధాకరమని, ఉపసంహరణపై ఆయనకు నచ్చజెప్తామని సుష్మా స్వరాజ్ చెప్పారు. అద్వానీ ఇంటికి వికె మల్హోత్రా, అనంత కుమార్, సుధీంద్ర కులకర్ణి, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు తదితరులు వచ్చారు. అద్వానీ రాజీనామా దురదృష్టకరమని ఆర్ఎస్ఎస్ ప్రకటించింది.

పార్టీని ఉన్నత శిఖరాలకు తీసుకు వెళ్లిన నేత: శరద్ యాదవ్

అద్వానీ నిర్ణయం తనను బాధించిందని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ అన్నారు. భారతీయ జనతా పార్టీని ఉన్నత శిఖరాలకు వ్యక్తి అద్వానీ అన్నారు. ఆయన ముందు చూపున్న నేత అని, ఈ వ్యవహారంపై త్వరలో జెడి(యు) సమావేశమవుతుందని, భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామన్నారు. ఇది ఎన్డీయేకు మేలు చేయదన్నారు. అద్వానీ లేని ఎన్డీయేలో ఉండమన్నారు.

పార్టీ అంతర్గత విషయం: చంద్రబాబు

అద్వానీ, నరేంద్ర మోడీల అంశం బిజెపి అంతర్గత విషయమని, దానిపై తాను స్పందించనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Veteran politician LK Advani on Monday resigned from all positions in the Bharatiya Janata Party saying "for some time I have been finding it difficult to reconcile either with the current functioning of the party, or the direction in which it is going".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more