వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు మంచి మనసుంది: షర్మిల, పాదయాత్రలో దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dadi in Sharmila padayatra
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర విశాఖ జిల్లాలో కొనసాగుతోంది. షర్మిల పాదయాత్రలో మంగళవారం ఆ పార్టీ సీనియర్ నేత దాడి వీరభద్ర రావు పాల్గొన్నారు. దాడి ఇటీవలె తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. షర్మిల పాదయాత్రలో ఆయన కూడా కాలు కలిపారు. విశాశలో రెండో రోజు పాదయాత్రలో షర్మిల మాట్లాడారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చారని, అదీ ఆయనకున్న గొప్ప మనసని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు కేవలం 16 లక్షల మందికి పింఛన్ ఇస్తే, వైయస్సార్ 71 లక్షల మందికి ఇచ్చారన్నారు. వికలాంగుల పట్ల ఇంకొంచెం ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని, అలా చేయకపోతే మనకు, రాక్షసులకు తేడా ఉండదని వైయస్సార్ అనేవారన్నారు.

ఈ ప్రభుత్వం వైయస్ రెక్కల కష్టం మీద వచ్చిందని, ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, ఆయన పథకాలను తుంగలో తొక్కుతోందన్నారు. త్వరలోనే ప్రజలు కోరుకుంటున్నట్లుగా జగన్ వస్తాడని, వైయస్ ఎలా ఆదరించారో అలా ఆదరిస్తారన్నారు. జగన్‌కు వైయస్‌లా మంచి మనసుందన్నారు. ప్రజల గురించి జగన్ ఎప్పుడూ ఆలోచిస్తుంటారని షర్మిల అన్నారు.

మంగళవారం 190వ రోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎ శరభవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శృంగవరం, గాంధీనగరం, తాండవ కూడలి, ఎర్రవరం కూడలి, ములగపూడి మీదుగా బెన్నవరం చేరుకున్నారు. బెన్నవరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 12.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,520.10 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది.

English summary

 YSR Congress Party senior leader Dadi Veerabhadra Rao has participated in party chief YS Jaganmohan Reddy's sister Sharmila padayatra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X