నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంటి ప్రసాదంపై కాల్పులు, వేటకొడవళ్లతో దాడి: మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ganti Prasadam
నెల్లూరు/మెదక్: అమరవీరుల బంధుమిత్రుల కమిటీ నేత గంటి ప్రసాదం పైన గుర్తు తెలియని దుండగులు గురువారం మధ్యాహ్నం కాల్పులు జరిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొనేందుకు వచ్చిన గంటి ప్రసాదం పైన దుండగులు వేట కొడవళ్లతో దాడులు చేశారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గంటి ప్రసాదం మరణించారు. అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంటన్నర ప్రాంతంలో ఆయన మృతి చెందారు.

దాడిలో ఆయనకు తీవ్రంగా గాయాలు కావడంతో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. గంటి ప్రసాదం నెల్లూరుకు వస్తున్నాడని తెలిసి ముందస్తు వ్యూహంగానే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.

కిరాయి గూండాలతో కలిసి పోలీసులే గంటి ప్రసాదంపై కాల్పులు జరిపించారని అమరవీరుల బంధుమిత్రుల కమిటీ మరో నేత పుష్మ ఆరోపించారు. కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసులే ఇలా దాడి చేశారని వరవర రావు కూడా ఆరోపించారు. ప్రభుత్వం హింసాత్మక చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు.

కాగా నిందితులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షి అంజమ్మ తెలిపారు. ఒకరు వేట కొడవలితో దాడి చేశారన్నారు. దుండగుల మొహానికి మాస్కులు ఏమీ లేవన్నారు. గంటి ప్రసాదం అంతకుముందు ఉదయం నెల్లూరులో జరిగిన విరసం సభలో పాల్గొన్నారు.

English summary
Ganti Prasadam attacked by unknown people on Thursday in SPS Nellore district. He was injured and taken to hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X