వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ వస్తుంది: డిఎస్, మాతో మాట్లాడాలి: ఏరాసు

By Pratap
|
Google Oneindia TeluguNews

D Srinivas
హైదరాబాద్: తెలంగాణ తప్పకుండా వస్తుందని పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ఆయన అడిగారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన ఈ మాటలన్నారు. కాంగ్రెసులో ఉన్న సామాజిక భద్రత మరే పార్టీలోనూ లేదని ఆయన అన్నారు.

కాగా, తమ ప్రాంతం నాయకులతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకోవాలని రాయలసీమకు చెందిన మంత్ర ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరి వల్లనే ప్రస్తుత ఇబ్బంది ఏర్పడిందని ఆయన సోమవారంనాడు అన్నారు.

కాగా, హైదరాబాదుతో కూడిన తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజా సంఘాల జెఎసి నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. ప్రజా సంఘాల జెఎసి సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ఈ నెల పదో తేదీన కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌ను, 11వ తేదీన కేంద్ర హోం మంత్రి దిగ్విజయ్ సింగ్‌ను, 12వ తేదీన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుస్తామని ఆయన చెప్పారు.

తనకు చెప్పకుండా తెలంగాణ ఎలా ఇస్తారని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు కె.టి. రామారావు మంత్రులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కేంద్రాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఇస్తే తెరాసను కాంగ్రెసులో ఎందుకు విలీనం చేయరని ఆయన అడిగారు.

ప్యాకేజీ అందలేదని కెసిఆర్ ఇన్నాళ్లు తెలంగాణను అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కన్నా కుటుంబ ప్రయోజనాలే కెసిఆర్‌కు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే ప్రజలు కాంగ్రెసుకు బ్రహ్మరథం పడుతారని, మరోసారి కాంగ్రెసు అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.

English summary
PCC former president D Srinivas expressed confident of forming Telangana state. Minister from Rayalaseema Erasu Pratap Reddy said that his region leaders should be consulted on bifurcation issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X