మా లీడర్ కెసిఆరే: ఏ పార్టీలో ఉన్నది చెప్పిన వివేక్

తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా తాను కాంగ్రెస్ పార్టీని వీడానని చెప్పారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అనుకున్నఅనుకున్నస్థాయిలో ఫలితాలు సాధించకపోవడాన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. తాను తమ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలోనే పని చేస్తున్నానని, ఏ పార్టీలో ఉన్నానని వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
తెలంగాణపై కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవడంతోపాటు సహచర ఎంపీలు పిలిస్తే ఢిల్లీ వెళ్లానని చెప్పుకొచ్చారు. పాత పరిచయం వల్ల కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేని కలిసి.. తెలంగాణ రాష్ట్రాన్ని తక్షణమే ప్రకటించాలని కోరానన్నారు. తెలంగాణపై కేంద్రంలో కదలిక వచ్చినప్పుడల్లా సీమాంద్ర నాయకులు పార్టీలకతీతంగా ఒక్క టై రాష్ట్రం రా కుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications