చక్రం తిప్పేందుకే: తెలంగాణపై చంద్రబాబు మీద విష్ణు

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను లిక్కర్ డాన్ అని బాబు అనడాన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఉత్తరాఖండ్ వరదల సమయంలో కేదార్‌నాథ్ యాత్రికులను తరలించడంలో రాజకీయం చేసిన బాబు ఇప్పుడు ఖమ్మం తదితర జిల్లాల్లో వరదలు వస్తే ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. బాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, ఇదే సహకార ఎన్నికలలోను, పంచాయతీ ఎన్నికలలో ప్రతిబింబించిందన్నారు.
తెలంగాణపై అధిష్టానం నిర్ణయం వల్లే: పొన్నం
తెలంగాణపై అధిష్ఠానం నిర్ణయం వల్లే పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు తెలంగాణలో ఎక్కువ స్థానాలను గెలుచుకోగలిగారని కరీంనగర్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ ఇస్తే అన్ని ఎన్నికల్లోనూ తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజన అంశంపై అన్ని రకాల సంప్రదింపులు పూర్తయ్యాకే అధిష్ఠానం నిర్ణయం తీసుకొందని తెలిపారు. లేఖలు రాసి సరిపెట్టుకోవాలని అంతేగాని ఢిల్లీ వెళ్లి అధిష్ఠానం, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ప్రకటనలు చేయడం సరైన విధానం కాదని సీమాంధ్ర మంత్రులకు ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications