చివరిదాకా పోరాటం: శైలజానాథ్, ఫస్ట్ వ్యక్తిని నేను: జెసి

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటామన్నారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు సమైక్యానికి కట్టుబడి ఉన్నారన్నారు. ఊహాగాన వార్తలను తాము పట్టించుకోమన్నారు. రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులు కావూరి సాంబశివ రావు, పురంధేశ్వరి తదితరులు సమైక్యవాదానికే కట్టుబడి ఉన్నారన్నారు.
ప్రజాస్వామ్యంలోని అన్ని అవకాశాలను సమైక్యం కోసం ఉపయోగించుకుంటామన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుది సమైక్యవాదానికి భిన్నమైన వైఖరి అని, అది దుర్మార్గమన్నారు. సీమాంధ్రలో మోహరిస్తున్న బలగాల గురించి తమకు ఏమీ సమాచారం లేదన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే రెండు రాష్ట్రాలకు నష్టమే అన్నారు. ఏది ఏమైనా పార్టీని వీడమని, అయితే త్యాగాలకు మాత్రం సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తాము కలవని కేంద్ర నేతలు లేరన్నారు.
అనివార్యమైతే...: జెసి
విభజన అనివార్యమైతే తాను తెలంగాణతో ఉండేందుకు ఇష్టపడతామని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. తాను వ్యక్తిగతంగా సమైక్యవాదిని అన్నారు. రాజీనామాలు తొందరపాటు అన్నారు. రాజీనామాలు చేసినా తమ పార్టీ నేతలు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనుకునే వారిలో తాను మొదటి వ్యక్తిని అని చెప్పారు. విభజిస్తే రాయల తెలంగాణ ఇవ్వాలన్నారు.
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications