చున్నీ లాగారు: ప్రమాదానికి గురైన అమ్మాయి

బేగంబజార్‌లో వ్యాపారం నిర్వహిస్తున్న పాతబస్తీకి చెందిన నలుగురు యువకులు హూండాయ్ కారులో ఆ యువతిని వెంబడించారు. అసభ్యకర మాటలతో దారిపొడవునా వేధించడమే కాకుండా కారును యువతిపైకి పోనిస్తున్నట్టుగా చేస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. ఈ క్రమంలో లంగర్‌హౌస్ టిప్పుఖాన్‌బ్రిడ్జి వద్దకు రాగానే యువతి మెడలోని చున్నీని లాగేశారు.
దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ యువతి పోకిరీల వెకిలిచేష్టల నుంచి తప్పించుకునేందుకు ద్విచక్ర వాహన వేగం పెంచింది. యువకులు సైతం కారు వేగం పెంచడమే కాకుండా మరింత ముందుకు తీసుకెళ్లి యువతి వాహనానికి అడ్డంగా పోనిచ్చారు. బెదిరిపోయిన యువతి తన ద్విచక్ర వాహనాన్ని పక్కకు తిప్పింది.
అదే సమయంలో వెనుకనుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టడంతో కిందపడి తీవ్రగాయాల పాలైంది. స్పందించిన స్థానికులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం పోలీసులకు సమాచారమివ్వడంతో వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications