ఉద్యమమే రాజ్యాంగ విరుద్ధం, సిటీ హక్కుమాదే: కోదండ

ఒక్కొక్క రోజు ఒక్కో సంఘం నేతలు ఇందులో పాల్గొంటారన్నారు. రాష్ట్ర విభజనకు అన్ని ప్రాంతాల ప్రజలు శాంతియుతంగా సహకరించాలని, తమ ఉద్యమ కార్యాచరణ ఆ దిశగానే ఉంటుందని వెల్లడించారు. ఇదే క్రమంలో శుక్రవారం తాను ఢిల్లీ వెళ్లినట్లుగా వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తమవైపు తప్పులు ఉంటే సమీక్షించుకుంటామన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ దీక్ష గురించి ప్రస్తావించగా సమైక్యాంధ్ర ఉద్యమం రాజ్యాంగ వ్యతిరేకమని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వద్దని ఆమె ఎలా చెబుతారని, ఆమెకు ఆ హక్కు లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరే హక్కు ఉంటుంది తప్ప.. వేరే ప్రాంతాన్ని కలపాలని డిమాండ్‌చేసే హక్కు ఎవరికీ ఉండదన్నారు. ఆంటోనీ కమిటీ వద్దకు తాము వెళ్లబోమన్నారు. అధికారికంగా ఆహ్వానిస్తే ఐకాసలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
హైదరాబాద్‌లో సభ నిర్వహించుకునేందుకు సీమాంధ్ర ఉద్యోగులకు ఎలా అనుమతిస్తారో చూస్తామన్నారు. తెలంగాణపట్ల ఒక వర్గం మీడియా కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కోదండరాం ఆరోపించారు. సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమంలో 11 ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనడం లేదని, అయినా ఆ విషయాన్ని మీడియా ఎక్కడా ప్రస్తావించలేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో అటువంటి సందర్భాలు చోటుచేసుకుంటే మాత్రం ప్రముఖంగా చూపిస్తున్నారని ఆక్షేపించారు. హైదరాబాదును శాశ్వత ఉమ్మడి రాజధానిగా అంగీకరించమన్నారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications