జగన్ సమైక్య దీక్ష: జైలు నుండి మోపిదేవి రాజీనామా

ఆయన దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఈ రోజు తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. మోపిదేవి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఫార్మాట్లో జైలు అధికారులకు అందజేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌కు అధికారులు పంపించనున్నారు. తాను జైలులో ఉన్నందు వల్లనే ఇలా లేఖ పంపాల్సి వచ్చిందని మరో లేఖలో స్పీకర్‌కు మోపిదేవి వివరించారు. మోపిదేవి రాజీనామా గుంటూరులో కలకలం రేపింది.
జగన్ దీక్షకు మోపిదేవి ఈ రోజు సంఘీభావం తెలిపారు. జగన్ బ్యారెక్‌కు వెళ్లి తన మద్దతును ప్రకటించారు. జగన్ ఆదివారం ఉదయం నుండి దీక్ష చేస్తున్నారు. కాగా, జగన్ దీక్షకు సంఘీభావంగా మోపిదేవి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన జగన్ వైపు వెళ్లినట్లే! గతంలోనే ఆయన సోదరుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
కాగా, వైయస్ జగన్ ఆస్తుల కేసులో మోపిదేవి వెంకటరమణ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన వాన్ పిక్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. జగన్ కూడా తన ఆస్తుల కేసులో జైలులో ఉన్నారు.
జగన్ రిమాండ్ పొడిగింపు
మరోవైపు ఆస్తుల కేసులో జగన్ రిమాండును సిబిఐ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 6వ తేది వరకు పొడిగించింది. జగన్ ను కోర్టు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించింది. జగన్ ఆస్తులు, ఎమ్మార్, ఓఎంసి కేసుల ఇతర నిందితుల రిమాండును కూడా సెప్టెంబర్ 6 వరకు పొడిగించింది.












Click it and Unblock the Notifications