ఫొటోలు: జగన్ వల్ల రోగుల బంధువుల పాట్లు ఇలా...
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఉంచడంతో రోగుల బంధువులు తీవ్రమైన పాట్లు పడుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రి వద్ద ముళ్ల కంచెలు వేసి లోనికి ఎవరూ రాకుండా ఏర్పాట్లు చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వాస్పత్రి అయిన ఉస్మానియాలో చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వచ్చే కుటుంబ సభ్యులు, వారి బంధువులు చెప్పనలవి కాని పాట్లు పడుతున్నారు.
హైదరాబాదులోని చంచల్‌గుడా జైలులో సమైక్యాంధ్ర కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైయస్ జగన్‌ను గురువారం రాత్రి ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. ఆస్పత్రి వద్ద పోలీసు, భద్రతా బలగాలు కాపలా కాస్తున్నాయి. దానికితోడు, వైయస్ జగన్ అభిమానుల హంగామా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యర్తల హడావిడి కూడా చోటు చేసుకుంది.
గురువారంరాత్రి ఉస్మానియా ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తమైన పరిస్థితి నెలకొని ఉంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీంతో రోగుల బంధువుల ఇక్కట్లు చెప్పనలవి కాకుండా ఉన్నాయి.

ముళ్లకంచెలతో అడ్డంకులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఉస్మానియా ఆస్పత్రిలో చేర్చిన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. దాంతో రోగుల బంధువులు తీవ్రమైన ఇక్కట్లు పాలవుతున్నారు.

నిఘా, మీడియా వాహనాలు..
ఉస్మానియా ఆస్పత్రి వద్ద భద్రతా సిబ్బంది కాపలా కాస్తున్నారు. మీడియా వాహనాలు కూడా అక్కడ కాపలా కాస్తున్నాయి. ఎప్పుడు ఏ చీమ చిటుక్కుమంటుందోనని ఎదురు చూస్తూ మీడియా ఎదురు చూపులు...

పసిపాపతో వ్యక్తి...
ఉస్మానియా ఆస్పత్రికి సాధారణంగా సామాన్యులు, పేదలు వస్తుంటారు. జగన్‌ను ఆస్పత్రిలో చేర్చడంతో వారికి ఇబ్బందులు ఎదరువుతున్నాయి. ఓ పసిపాపతో ఇబ్బందులు పడుతూ ఓ వ్యక్తి ఇలా..

పాస్‌తో ఇలా...
ఆస్పత్రిలోకి మరీ తనిఖీ చేసి పంపిస్తున్నారు. పాస్‌లు ఉంటే తప్ప లోనికి అనుమతించడం లేదని అంటున్నారు. పాస్‌లు చూపిస్తూ ఇలా...

గేటు దూకి ఇలా...
రోగుల బంధువులు ఇలా గేట్లు దుమికి లోనికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. వైయస్ జగన్‌ను ఆస్పత్రిలో చేర్చడంతో రోగుల బంధువులు ఇలా కష్టాలు పడాల్సి వస్తోంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications