బంద్: మహిళ క్రికెట్, బోసిబోయిన ఇమ్లిబన్!(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ విజయవంతమైంది. ఎపిఎన్జీవోల సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ తెలంగాణ ఐకాస బందుకు పిలుపునిచ్చింది. బస్సులు తిరగలేదు. ఆటోలూ కనిపించలేదు. విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.
ఆర్టీసీ ముందుగానే బస్సులను నిలిపివేసింది. విద్యా సంస్థల బంద్‌కు గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల సంఘం సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోలేదు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, పారిశ్రామికవేత్తలు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఉద్యోగులు బందులో పాల్గొన్నారు.
సమైక్యసభను నిరసిస్తూ తెలంగాణవాదులు ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేశారు. నగరంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుండి తెలంగాణవాదులు బస్సులను, ఇతర వాహనాలను అడ్డుకున్నారు.

భద్రత
తెలంగాణ బందు నేపథ్యంలో శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసుల పహారా. ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ టిజెఏసి బందుకు పిలుపునిచ్చింది.

కంటోన్మెంట్ బోర్డ్
తెలంగాణ బందు నేపథ్యంలో శనివారం కంటోన్మెంటు బోర్డులో క్రికెట్ ఆడుతున్న తెలంగాణ ఉద్యోగి. ముఖ్యమంత్రి వైఖరిని నిరసిస్తూ టిజెఏసి బందుకు పిలుపునిచ్చింది.

ఇమ్లిబన్
తెలంగాణ బందు సందర్భంగా శనివారం నాడు హైదరాబాదులోని మహాత్మా గాంధీ సెంట్రల్ బస్ స్టాండ్ నిర్మానుష్యంగా మారిన దృశ్యం.

జెబిఎస్
తెలంగాణ బందు సందర్భంగా శనివారం నాడు సికింద్రాబాదులోని జూబ్లీ సెంట్రల్ బస్ స్టాండ్ నిర్మానుష్యంగా మారిన దృశ్యం. బస్సులు డిపోకే పరిమితమయ్యాయి.

రాణిగంజ్
తెలంగాణ బందు సందర్భంగా శనివారం నాడు సికింద్రాబాదులోని రాణిగంజ్‌లో డిపోకే పరిమితం అయిన లోకల్ బస్సులు. నగరంలో బస్సులు నడవలేదు.

సికింద్రాబాద్
తెలంగాణ బందు సందర్భంగా శనివారం నాడు సికింద్రాబాదు రైల్వే స్టేషన్ ప్రాంతం. ఇక్కడ నిత్యం జనసమ్మర్దంగా ఉంటుంది. బందు కారణంగా జనం అంతగా లేరు.

సచివాలయం
తెలంగాణ బందు సందర్భంగా శనివారం నాడు సచివాలయం బోసి పోయింది. ఓ వైపు బందు, మరోవైపు ఎపిఎన్జీవోల సభ కారణంగా ఇరు ప్రాంత ఉద్యోగులు రాలేదు.

షాపింగ్ మాల్స్
తెలంగాణలో బందు కారణంగా హైదరాబాదులోని షాపింగ్ మాల్స్ బోసిపోయాయి. హబ్సిగూడలో నిర్మానుష్యంగా మారిన రోడ్ల దృశ్యం.

ఉప్పల్
తెలంగాణ బందు సందర్భంగా శనివారం నాడు రాష్ట్ర రాజధానిలోని ఉప్పల్‌లో డిపోకే పరిమితం అయిన లోకల్ బస్సులు. నగరంలో బస్సులు నడవలేదు.












Click it and Unblock the Notifications