పిక్చర్స్: ఎల్పీ స్టేడియాన్ని లాయర్లు శుద్ధి చేశారు

హైదరాబాద్: సమైక్యవాదుల రాకతో, సమైక్యాంధ్ర నినాదాలతో ఎల్‌బి స్టేడియం మలినమైందని తెలంగాణ న్యాయవాదుల జెఎసి ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య ఆదివారం స్టేడియాన్ని పాలతో శుద్ధి చేశారు. పసుపు, పాలతో స్టేడియాన్ని శుద్ధి చేశారు. శనివారం ఎపి ఎన్జీవోలు సేవ్ ఆంధ్రప్రదేశ్ పేర సమైక్యాంధ్ర సభను నిర్వహించిన విషయం తెలిసిందే.

ఉద్యోగుల సభ ముసుగులో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కిరాయి రౌడీలు సభకు వచ్చి తెలంగాణవాదులపై దాడులు చేశారని వారు ఆరోపించారు. ఎపి ఎన్జీవోల సభలో ఉద్యోగుల సంఖ్య కన్నా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కార్యకర్తలే ఎక్కువగా ఉన్నారని అన్నారు. సభను శాంతియుతంగా నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికిన ఎన్జీవో నేతలు తెలంగాణవాదులపై దాడులకు దిగడం సమంజసం కాదన్నారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన ఓయు విద్యార్థి జెఎసి నేత బాలరాజు యాదవ్‌పై సమైక్య రౌడీల దాడిని, అలాగే నిజాం కాలేజీ హాస్టల్‌లో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ న్యాయవాదుల జెఎసి తరుపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తెలంగాణ న్యాయవాదుల జెఎసి నేతలు గోవర్ధన్‌రెడ్డి, శ్రీరంగారావు, సిహెచ్. ఉపేంద్ర, మోహన్‌రావు, పెద్ద సంఖ్యలో మహిళా న్యాయవాదులు, తెలంగాణవాదులు పాల్గొన్నారు.

పాలతో కడిగారు...

పాలతో కడిగారు...

సమైక్యవాదుల రాకతో, వారి అబద్ధాలతో ఎల్బీ స్టేడియం అపవిత్రమైందని తెలంగాణ న్యాయవాదులు అన్నారు. అందుకే తెలంగాణ న్యాయవాదుల జెఎసి తరుపున స్టేడియాన్ని పాలతో శుద్ధి చేశామని తెలిపారు.

ముఖ్యమంత్రిపై విమర్శలు

ముఖ్యమంత్రిపై విమర్శలు

ముఖ్యమంత్రి, డిజిపిలు ఇద్దరూ సీమాంధ్ర ఉద్యమానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన తీరు మార్చుకుని ఇరు ప్రాంతాలకు ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని సూచించారు.

వేద మంత్రోచ్ఛారణలతో..

వేద మంత్రోచ్ఛారణలతో..

ఎల్బీ స్టేడియాన్ని పాలు, పసుపుతో వేద మంత్రోచ్ఛారణల మధ్య తెలంగాణ న్యాయవాదులు శుద్ధి చేశారు. ఎపిఎన్జీవోల సభకు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలే వచ్చారని వారు విమర్శించారు.

నినాదాలతో మలినం..

నినాదాలతో మలినం..

సమైక్యాంధ్ర నినాదాలతో హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం ఎపి ఎన్జీవోల సందర్భంగా అపవిత్రమైందని, అందుకే దాన్ని శుద్ధి చేశామని తెలంగాణ న్యాయవాదులు అన్నారు.

దాడిపై సీరియస్..

దాడిపై సీరియస్..

శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చిన ఓయు విద్యార్థి బాలరాజు యాదవ్‌పై సీమాంధ్రులు దాడి చేయడాన్ని తెలంగాణ న్యాయవాదులు ఖండించారు. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+