Ileana: సూపర్ అప్‌డేట్ ఇచ్చిన "పోకిరి" పోరీ.. బిడ్డకు తండ్రి ఎవరో తెలుసా..?
Ileana:ఇలియానా... ఈ గోవా బ్యూటీ ఒకప్పుడు టాలీవుడ్‌ను తన అందంతో అల్లాడించింది. దేవదాస్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ భామ ఆ తర్వాత పలు స్టార్ హీరోలతో నటించి తనదైన ముద్ర వేసుకుంది. అందం, అభినయంతో యువతకు గాలం వేసి తనవైపు తిప్పుకున్న డస్కీ బ్యూటీ ఇలియానా.టాలీవుడ్‌లో క్రమంగా ఆఫర్లు తగ్గుతున్న సమయంలో 2012లో బర్ఫీ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
మహేష్ బాబు సరసన నటించిన పోకిరి సినిమాతో ఈ బెల్లీ బేబీ ఇల్లీ రేంజ్ మరో లెవెల్‌కు వెళ్లిపోయింది.ఇక ఇలియాన పలు వివాదాలకు కూడా కారణమైంది. సెక్స్ పై తాను బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. శృంగారం చేయడం ద్వారా తాను చాలా రిలాక్స్ అవుతానంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. సెక్స్‌తో చాలా యవ్వనంగా కనిపిస్తానని, అదేసమయంలో వయసు కూడా పెద్దగా కనిపించదని చెప్పుకొచ్చింది ఈ గోవా భామ.

అప్పట్లో ఇలియానా ఆండ్రూ నీబోన్ అనే ఓ ఆస్ట్రేలియన్ ఫోటోగ్రాఫర్‌తో డేటింగ్ చేసింది. కొన్నేళ్లు వీరిద్దరూ చట్టాపట్టాల్ వేసుకుని తిరిగారు. అయితే 2019 ఆగష్టులో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది.ఇక ఆ తర్వాత ఈ అమ్మడు కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మైఖేల్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సెబాస్టియన్ లండన్‌లో నివసిస్తూ మోడలింగ్‌లో రాణిస్తున్నాడు.
ఇదంతా అటుంచితే... ఇలియానా తన ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇలియానాకు ఇది గుడ్ న్యూసే అయినా ఫ్యాన్స్‌కు మాత్రం ఒక్కింత బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇలియానా త్వరలో తల్లి కాబోతున్నట్లు ఇన్స్‌టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది. అవును మీరు చదివింది కరెక్టే. "coming soon.can't wait to meet you my little darling" అంటూ ఇన్స్‌టాలో పోస్టు రాసుకొచ్చింది. దీనికి ఇలియానా తల్లి సమీరా రిప్లయ్ ఇచ్చింది. ఈ ప్రపంచంలోకి త్వరలో అడుగుపెడుతున్న గ్రాండ్ బేబీకి స్వాగతం అంటూ రిప్లయ్ ఇచ్చింది. దీంతో ఇలియానా ప్రెగ్నెన్సీ న్యూస్ కన్ఫామ్ అయ్యింది.












Click it and Unblock the Notifications