ఒక్క పిలుపు ఇస్తే, కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఉండవు : బీజేపీ ఎంపీ సోయం బాపురావు
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ వైరుధ్యం రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మెకు పూర్తి మద్దతు పలుకుతున్న బీజేపీపై టీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. నేరుగా సీఎం కేసీఆర్ బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. పార్టీ ద్వంద విధానాలు అవలంభిస్తుందని ఆయన పలు ఆరోపణలు చేశారు. ఇక బీజేపీ నేతలు ఎంపీలుగా గెలుపోందిన పలు స్థానాల్లో సైతం ఇరు పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతవరణం నెలకోంటుంది.
ఈనేపథ్యంలోనే ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ఎంపీ, టీఆర్ఎస్ మాజీ మంత్రుల మధ్య రాజకీయా వైరం మరింత ముదిరింది. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు మాజీ మంత్రి జోగురామన్నపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జైల్లో పెట్టిస్తానని ఆయన హెచ్చరించారు. ఇక యూరేనియం తవ్వకాల్లో అనుమతుల పాపం జోగు రామన్నదే అని, ఆయన ఇందుకు జైలుకు వెళ్లడానికి సిద్దంగా ఉండాలని ఆయన అన్నారు. జోగు రామన్న నక్సలైట్ ప్రాంతాల అభివృద్ది నిధులతో టీఆర్ఎస్ నేతల పోలాలకు రోడ్లు వేసుకున్నారని ఆయన పలు ఆరోపణలు చేశారు. ఇందుకోసం ఆదివాసీలకు డబ్బు ఆశ చూపారని చెప్పారు.

మరోవైపు ఆదివాసిల పోరాటంపై ఆయన గళం విప్పారు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన లంబాడాలను ఎస్టీ జాబితాలో నుండి తోలగించాలని ఆయన ఈ సంధర్భంగా డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆదివాసీల పోరాటం ఆపేది లేదని ఆయన హెచ్చరించారు. ఆదివాసీలకు తాను ఒక్క పిలుపు ఇస్తే కలెక్టర్ ఆఫీస్ గాని ఎస్పీ కార్యాలయాలుగాని ఉండవని ఆయన హెచ్చరించారు.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications