ఒంటి మీద దుస్తులు లేకుండానే మహిళలు..ఆ గ్రామంలో వింత ఆచారం
ప్రపంచంలో మనకు తెలియని చాలా వింతైనా ఆచారాలు ఉన్నాయి. ప్రాంతాలు, స్థానికతను బట్టి ఆచారాలు ఉండటం సహజమే. మన దేశంలో కూడా కొన్ని వింత ఆచారాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మనకు ఆశ్చర్యాన్ని కల్గిస్తుంటాయి. సరిగ్గా అలాంటి ఆచారమే ఒకటి మన దేశంలో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ గ్రామంలోని మహిళలంతా ఏడాదిలో ఐదు రోజులపాటు దుస్తులు లేకుండానే నివసిస్తారట.
ఈ ఆచారం విన్న తరువాత ఒక్కసారిగా అందరు నిర్ఘాంతపోయారు. ఇదేక్కడి ఆచారం అంటూ సోషల్ మీడియాలో ఆ గ్రామం ఎక్కడ ఉందో అని వెతుకులాట మొదలు పెట్టారు. ఆ గ్రామం మరెక్కడ కాదు...హిమచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. హిమచల్‌ప్రదేశ్‌లోని కులు జిల్లాలోని పిని అనే గ్రామంలో ఈ వింత ఆచారం చోటు చేసుకుంది.

పిని గ్రామంలోని మహిళలు ఏడాదిలో ఐదు రోజులపాటు దుస్తులు లేకుండానే నివసిస్తారట. వందల ఏళ్ల నుంచి ఇది తమ సంప్రదాయమని వారు చెబుతున్నారు. ఇది వారి తరతరాలుగా వస్తున్న ఆచారం కూడా. ఇలా చేయడం ద్వారా ప్రకృతికి ఇచ్చే గౌరవంగా వారు భావిస్తారట. స్థానిక దేవతకు వారు ఈ విధంగా పూజలు చేస్తారట. సూర్యుని కాంతి, స్వచ్ఛమైన గాలి, వాతవారణంలోని సహజ వాయువులను అలింగనం చేసుకోవడానికే గ్రామంలోని మహిళలంతా ఇలా చేస్తారట.

పైగా ఇలా చేస్తే తమను తాము శుద్ధి చేసుకున్నట్టు వారి భావిస్తారట. తమతో పాటు, గ్రామాన్ని కూడా క్షేమంగా చూడాలని దేవతను కోరుతూ.. మహిళలు తమ ఒంటిపై దుస్తులు తీసి గ్రామ దేవతను పూజిస్తారట. ఇలా చేయడం వారి ఆధ్యాత్మికతలో ఒక భాగమే అని వారు అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది












Click it and Unblock the Notifications