సమంత ఊ అంటావా సాంగ్‌పై అభ్యంతరం, హైకోర్టులో కేసు వేసిన మెన్ అసోసియేషన్
సినిమాలు.. సాంగ్స్‌కు సంబంధించి కేసులు కామన్ అయిపోయాయి. అయితే ఈ సారి ఏకంగా పురుషుల అసోసియేషన్ స్పందించింది. అవును మరీ.. మగాళ్లను కించరిచేలా ఆ సాంగ్ ఉందని... ఏకంగా ఏపీ హైకోర్టులో కేసు వేసింది. పుష్ప మూవీలోని ఉ అంటావా మావా.. ఊ ఊ అంటావా మామా సాంగ్‌కు ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆ సాంగ్‌కు విమర్శలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే పురుషులను చెడు ఉద్దేశంతో రాశారని.. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పురుషుల అసోసియేషన్ మండిపడింది.
సమంత చేసిన ఐటెం సాంగ్ 'ఉ అంటావా మావా... ఊఊ అంటావా మామా' పాటకు సంబంధించిన లిరికల్ వీడియోను ఇటీవలే యూట్యూబ్‌లో విడుదల చేశారు. పాటకు జనం నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూ ట్యూబ్‌లో సాంగ్ దూసుకెళ్తుంది. తాజాగా విడుదల చేసిన 19 సెకన్ల వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ ఏపీలోని పురుషుల అసోసియేషన్ మాత్రం తప్పుపట్టింది. పాట తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కేసు వేసింది. మగవాళ్లు కేవలం కామంతోనే ఉంటారనే అర్థం వచ్చేలా ఆ పాట ఉందని పురుషుల అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పాట భావం అలా ఉందని తెలిపింది.

Recommended Video
పాటపై నిషేధం విధించాలని హైకోర్టులో పిటిషన్ వేసింది. తమకు న్యాయం చేయాలని వేడుకుంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన 'పుష్ప' మూవీ డిసెంబర్ 17న విడుదల కానున్న సంగతి తెలిసిందే. సమంత చేసిన ఐటెం సాంగ్ ఇటీవల రిలీజ్ చేయగా.. మంచి హైప్ వచ్చింది. కానీ పురుష అసోసియేషన్ నుంచి మాత్రం అభ్యంతరం వ్యక్తమయ్యింది. ఈ పాటకు చంద్రబోస్ స్వరాలు సమకూర్చగా.. మంగ్లీ సోదరి.. ఇంద్రావతి చౌహాన్ పాట పాడారు. అయితే చివరలో దీపాలన్నీ ఆర్పేశాక అందరు మగాళ్లదీ వంకర బుద్దే అనే స్వరం ఉంది. దీనిని అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏపీ పురుషుల అసోసియేషన్ ఏకంగా కేసు వేసింది.












Click it and Unblock the Notifications