అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోస్తాను వణికిస్తున్న తుఫాను : తీవ్ర తుఫానుగా పెథాయ్‌

|
Google Oneindia TeluguNews

Recommended Video

Cyclone Pethai: Andhra Pradesh On High Alert | పెథాయ్‌ ఎఫెక్ట్ తో ఊహించిన దానికంటే ఎక్కువ నష్టం!!

కోస్తాంధ్ర మొత్తం 'పెథాయ్‌'తో వణుకుతోంది. రాత్రి నుండి కోస్తా జిల్లాల్లో వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అన్ని జిల్లాల్లో నూ అధికారులు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసారు. పున‌రావాస శిబిరాలు సిద్దం అయ్యాయి. సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ, యానాం-తుని మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణులు అంచనా వేస్తున్నారు.

పెథాయ్ తుఫాను తీరం దిశగా దూసుకొస్తోంది. ఎక్కడ తీరం దాటుతుందనే అంశంపై వాతావ‌ర‌ణ శాఖ‌..ఆర్టీజిఎస్ లు అధికారుల‌ను అల‌ర్ట్ చేసాయి. ఏడు జిల్లాల పై ప్ర‌ధాన ప్ర‌భావం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఆ జిల్లాల అధికా రుల‌ను ఇప్ప‌టికే క్షేత్ర స్థాయిలో అన్ని ర‌కాలుగా సిద్దంగా ఉండాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది. తీరం తాకే సమయా నికి గాలుల తీవ్రత తగ్గుతుందని తొలుత భావించినప్పటికీ... ఆ అంచనా మారిపోయింది. అంతకుముందు గంటకు 14-15కి.మీ. వేగంతో కదిలిన తుఫాను తర్వాత 26కి.మీ. వేగం పుంజుకుంది. దీంతో తీరం వెంబడి గంటకు 50-60కి.మీ.

Cyclone effect on coastal Adnhra : Govt alerts Officials..

వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్‌ తీరందాటే సమయానికి గంటకు 100కి.మీ. వేగంతో గాలులు వీయవచ్చని, ఊహించిన దానికంటే ఎక్కువ నష్టమే కలిగించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే తీర ప్రాంతాల్లోని గ్రామాల ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు కార్య‌క్ర‌మం మొద‌లైంది

రాత్రి నుండి ఏడు జిల్లాల్లోనూ వ‌ర్షాలు కురుస్తున్నాయి. కొద్ది పాటి గాలులు వీస్తుండ‌గా..తీర ప్రాంతాల్లో ప్ర‌భావం ఎక్కువ గా కనిపిస్తోంది. ఇక‌, థాయ్‌ తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా మారింది. రాత్రి మచిలీపట్నానికి 380, కాకినాడకు 410కి.మీ. దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నందున ఈ ఉదయం నుంచి క్రమేపీ బలహీనపడి, సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని వాతావరణశాఖ, యానాం-తుని మధ్య తీరం దాటుతుందని ఆర్టీజీఎస్‌, ఇస్రో నిపుణులు అంచనా వేస్తున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారానికి తుఫాన్‌ బలహీనపడుతుం దని భావిస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని అక్కడక్కడ 20సెం.మీ. మేర వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కాకి నాడ, భీమునిపట్నం ఓడరేవులో ఏడు, విశాఖపట్నం, గంగవరంలో ఆరు, మచిలీ పట్నం, నిజాంపట్నంలో ఐదో నం బరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఇదే స‌మ‌యంలో ఏడు జిల్లాల అధికారులతో ముఖ్య‌మంత్రి టెలి కాన్పిరెన్స్ నిర్వ‌హించారు. అప్ర‌మ‌త్త‌తో వ్య‌వ‌హ‌రించాల‌ని ఆదేశించారు.

English summary
Cyclone effect heavy on Coastal Andhra. By today evening cyclone may hit between Kakiknada - Yanam . AP Govt alert Coastal districts officials on precautionary measures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X