అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాపుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు : ఈడ‌బ్ల్యూఎస్ కోటా లో స‌గం : అమ‌లు సాధ్యాసాధ్యాల పై క‌స‌ర‌త్తు..!

|
Google Oneindia TeluguNews

ఏపి మంత్రివర్గం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)లకు ఇచ్చే 10 శాతం కోటాను అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించింది. అందులోని ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల‌లో 5 శాతం కాపులకు, మిగతా 5 శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశంపై సమగ్రంగా చర్చించి విధివిధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో దాని అమలుపై రాష్ట్ర మంత్రిమండలి చర్చించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

అసెంబ్లీ ముందుకు ప్ర‌తిపాద‌న‌..

అసెంబ్లీ ముందుకు ప్ర‌తిపాద‌న‌..

కేంద్ర ప్ర‌భుత్వం ఆమోదించిన ఆర్దిక బ‌ల‌హీన వ‌ర్గాల కోటాను అమ‌లు చేయాల‌ని ఏపి మంత్రివ‌ర్గం నిర్ణ‌యించింది. అయితే, ఇందులో స‌గం అంటే అయిదు శాతం కాపుల‌కు కేటాయించాల‌ని తీర్మానించింది. గత ఎన్నిక‌ల స‌మయం లో ఇచ్చిన హామీ మేర‌కు కాపుల‌ను బిసిల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజునాధ క‌మిష‌న్ ను ఏర్పాటు చేసింది. క‌మిష‌న్ ఛైర్మ‌న్ మిన‌హా మిగిలిన మెజార్టీ స‌భ్యులు కాపు రిజ‌ర్వేష‌న్ కు అనుకూలంగా నివేదిక ఇచ్చారు. దీనిపై నాడు శాస‌న‌స‌భ‌లో ఆమోదించి..తీర్మానాన్ని కేంద్రానికి పంపింది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుండి దీని పై స్పంద‌న లేదు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈడ‌బ్ల్యూఎస్ కు ప‌ది శాతం కోటా పై నిర్ణ‌యం తీసుకుంది. దీని పై రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా నిర్ణ‌యం తీసుకొనే వెసులుబాటు ఉంది. దీంతో..ఏపి క్యాబినెట్ దీని పై లోతుగా చ‌ర్చించి ఈడ‌బ్ల్యూఎస్ కోటాను ఆమోదిస్తూ నిర్ణ‌యించింది.

2014లో ఎలా రిగ్గింగ్ చేశారంటే, గోపినాథ్‌ముండే మృతికి లింక్: లండన్ సైబర్ ఎక్స్‌పర్ట్ సంచలనం, ఈసీ ఆగ్రహం <br /> 2014లో ఎలా రిగ్గింగ్ చేశారంటే, గోపినాథ్‌ముండే మృతికి లింక్: లండన్ సైబర్ ఎక్స్‌పర్ట్ సంచలనం, ఈసీ ఆగ్రహం

హామే నెర‌వేర్చ‌టం కోసం..

హామే నెర‌వేర్చ‌టం కోసం..

తాము గ‌తంలో ఇచ్చిన హామీ అమ‌లు కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం ఈడ‌బ్ల్యూఎస్ కోటా లో కేటాయించిన ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్ల లో కాపుల‌కు అయిదు శాతం కేటాయించ‌టం ద్వారా ఆర్దిక బ‌ల‌హీన వ‌ర్గాల‌కు మేలు చేయ‌టం తో పాటుగా కాపుల‌కు తాము ఇచ్చిన హామీ నెర‌వేర్చిన‌ట్లు అవుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇది అమ‌లు చేయ‌గ‌లిగితే..ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌..రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని అంచాన వేస్తోంది . దీని కోసం ఈ ప్ర‌తిపాద‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్టేలా అవ‌స‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని సంబంధింత అధికారుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశించింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లోగా ఈ ప్ర‌తిపాద‌న‌కు సంబంధించిన న్యా య ప‌ర‌మైన చిక్కులు ఏమైనా ఉన్నాయా..ఏ ర‌కంగా ప‌రిష్క‌రించుకోవాల‌నే అంశం పై అధికారులు అధ్య‌య‌నం చేసి రాష్ట్ర ప్ర‌భుత్వానికి నివేదిక ఇవ్వ‌నున్నారు. క్యాబినెట్ లో తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని రాష్ట్ర మంత్రులు చారిత్రాత్మ‌క నిర్ణ‌యం గా మంత్రులు అభివ‌ర్ణిస్తున్నారు.

సాధ్యాసాధ్యాల పై అధ్య‌య‌నం..

సాధ్యాసాధ్యాల పై అధ్య‌య‌నం..

ఈడ‌బ్ల్యూఎస్ కోటా లో కాపుల‌కు స‌బ్ కోటా ఇవ్వ‌టం సాధ్య ప‌డుతుందా అనే అంశం పై త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు జ‌రుగుతున్నా యి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం లో కోటాను విడ‌గొట్టే సౌల‌భ్యం లేద‌ని..మొత్తం ప‌ది శాతాన్ని సంబంధిత వ‌ర్గాల కు క‌లిపే కేటాయించాల్సి ఉంటుంద‌ని కొంద‌రి వాద‌న‌. దీంతో..ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎలాంటి నిర్ణ‌యాలు తీసు కుంటున్నాయి..కాపుల‌కు ఇచ్చే కోటా న్యాయ‌ప‌రంగా ఎలా స‌మ‌ర్ధించుకోవాలి.. ఇది నిల‌బ‌డేలా ఏ ర‌కంగా ముందుకెళ్లా లి..కేంద్ర అధికారులు ఏం చెబుతున్నార‌నే అంశం పై రాష్ట్ర ప్ర‌భుత్వం దృష్టి సారించింది. దీని పై పూర్తి స్థాయిలో అవ‌స‌ర‌మైన స‌మాచారం సేక‌రిస్తున్నారు. ఈ నెల 30 నుండి ప్రారంభ‌మై..వ‌చ్చే నెల లో ముగియ‌నున్న అసెంబ్లీ ఓట్ ఆన్ ఎకౌంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌తిపాదించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ లోగానే దీనికి సంబం ధించి చేస్తున్న క‌స‌ర‌త్తు కొలిక్కి తేవాల‌ని క్యాబినెట్ అధికారుల‌ను ఆదేశించింది.

English summary
AP Govt decided to implement Kapu Reservation Quota 5 percent in EWS 10 percent quota. AP Cabinet directed officials togive total report on implementation of the latest decision.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X