కేసినేని వార‌సురాలు ఆగ‌మ‌నం..! బెజ‌వాడ రాజ‌కీయాల్లో మార్క్ చూపించ‌నున్న శ్వేత‌..!!

అమ‌రావ‌తి/హైద‌రాబాద్ : 2019 ఎన్నిక‌లను ఏపిలోని అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నాయి. ఏపీలోని మొత్తం 25 పార్ల‌మెంటు సీట్ల‌తో పాటు 13 జిల్లాల ప‌రిధిలోని 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌పై రాజ‌కీయ పార్టీలు ప్ర‌త్యేకంగా దృష్టి సారించాయి. ఎన్నిక‌ల వేళ ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీలు మారుతున్నా, అందుబాటులో ఉన్న నేత‌ల‌తోనే బిగ్ ఫైట్‌కు సిద్ధ‌మౌతున్నాయి ఏపిలోని రాజ‌కీయ పార్టీలు. ఐతే ఈ సారి జ‌ర‌గ‌బోవు సాధార‌ణ ఎన్నిక‌ల్లో యువ త‌రంగాలే కీల‌కంగా మార‌నున్నాయి. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే విష‌యాన్ని ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే, ఇప్పుడు తెర ముందుకు వ‌చ్చిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని త‌య‌న శ్వేత అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు.

ఇటీవ‌లే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన శ్వేత‌, మొన్న‌టి దాకా అమెరికాలో ఉన్నారు. విద్యాభ్యాసం చేస్తూనే, సోష‌ల్ స‌ర్వీస్‌లో త‌న‌దైన శైలిలో రాణించారు. నాలుగేళ్ల క్రితం జ‌రిగిన అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల ప్ర‌చారంలో త‌న‌దైన కీల‌క పాత్ర పోషించారు.

Keisenis successor arrives ..! Showing the mark in Bezawada politics..!!

అప్ప‌టి దాకా జ‌నానికి అంత‌గా తెలియ‌ని శ్వేత‌, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్ల‌రీ క్లింట‌ర్ ప్ర‌చార బృందంలో క్రియా శీల భూమిక పోషించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇటీవ‌ల అమెరికా నుంచి బెజ‌వాడ తిరిగి వ‌చ్చిన త‌ర్వాత స్థానిక ప‌రిస్థితుల‌ను అవ‌గాహ‌న చేసుకుంటూ సాగుతున్నారు. విజ‌య‌వాడ పశ్చిమ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ కూతురు ష‌బానా ఖాతూన్ తో క‌లిసి న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించారు. అమెరికా పొలిటిక‌ల్ క్యాంపెయిన్‌లో స‌త్తా చాటిన శ్వేత‌, బెజ‌వాడ ప్ర‌చారంలోకి దిగితే, టీడీపీకి తిరుగులేని ఆద‌ర‌ణ వ‌స్తుంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగే అవ‌కాశాలు లేకున్నా, నాని వార‌సురాలిగా శ్వేత స‌మీప భ‌విష్య‌త్తులో బెజ‌వాడ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేసుకోనున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+