సీఎం జగన్‌తో సజ్జల భేటీ.. కేబినెట్ కూర్పుపై డిస్కషన్స్..?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం రాజీనామాతో.. కొత్త క్యాబినెట్ ఫోకస్ నెలకొంది. 11వ తేదీ సోమవారం రోజున క్యాబినెట్ కొలువుదీరనుంది. ఈ క్రమంలో పాతవారికి అవకాశం ఇవ్వడంపై.. పూటకో రూమర్ బయటకు వస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం అయ్యారు. మంత్రివర్గం కూర్పు వేళ.. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో బెర్తులపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

జగన్‌తో సజ్జల భేటీ

జగన్‌తో సజ్జల భేటీ

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఇరువురి సమావేశం అయ్యారు. కేబినెట్ కూర్పుపై జ‌గ‌న్‌తో స‌జ్జ‌ల చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం. గురువారం కేబినెట్‌లోని మొత్తం 24 మంది మంత్రుల‌ు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న కొత్త కేబినెట్‌ ప్ర‌మాణం చేయనుంది. కొత్త‌గా మంత్రివ‌ర్గంలోకి ఎవ‌రెవ‌రిని తీసుకోవాలి? రాజీనామాలు చేసిన మంత్రుల్లో ఎవ‌రెవ‌రిని తిరిగి కేబినెట్‌లోకి తీసుకోవాలి అనే అంశాలపై జ‌గ‌న్‌తో స‌జ్జ‌ల చ‌ర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.

సస్పెన్స్ కంటిన్యూ

సస్పెన్స్ కంటిన్యూ

తిరిగి అవకాశం రావడంపై చాలా మంది మంత్రులు మాట్లాడలేదు. తొలి మంత్రివర్గ సమావేశంలోనే.. రెండున్నరేళ్లకు క్యాబినెట్ మారుతుందని జగన్ చెప్పారని అన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే తనకు అవకాశం రాదని అన్నారు. కొడాలి నాని కూడా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు. బొత్స సత్యనారాయణ మాత్రం.. దేవుడు, జగన్ అనుకుంటే అని కామెంట్ చేశారు. నిన్న సాయంత్రం.. ఐదారుగురికి అవకాశం అని కొడాలి నాని అనగా.. అదీ కాస్త ఇవాళ్టికి 10 మందికి చేరింది. సో ఎవరికీ బెర్త్ దక్కుతుందనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఆదివారం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు సీఎం జగన్ మంత్రుల జాబితాను అందజేస్తారు. సో ఆ రోజు వరకు సస్పెన్స్ తప్పడం లేదు.

పాత, కొత్తల కలయిక

పాత, కొత్తల కలయిక

నిన్న సీఎం జగన్‌ ఆధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. 36 అంశాలపై మంత్రివర్గం చర్చించింది. కేబినెట్ సమావేశం ముగిసిన వెంటనే 24 మంది మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ నెల 11న కొత్త మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. కొత్త, పాతల కలయికతో మంత్రివర్గం కొలువుదీరనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+