జగనాసుర రక్తచరిత్ర.. అయ్యన్న, బుద్ద ఫైర్, విజయమ్మ, షర్మిల అని అంటారెమో..

వైఎస్ వివేకా హత్య.. ఎవరి ప్రమేయం వల్ల మర్డర్ జరిగిందనే అంశంపై ఏపీలో దుమారం రేగుతుంది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. వివేకా హత్య వెనుక సీఎం జగన్ ఉండొచ్చంటూ వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొనడం తెలిసిందే. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. వివేకా కుమార్తె సునీత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేతిలో పావుగా మారారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నుంచి రియాక్షన్స్ ప్రారంభం అయ్యాయి.

విజయమ్మ, షర్మిల..

విజయమ్మ, షర్మిల..


టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఇవాళ సునీత చంద్రబాబు చేతిలో పావు అన్నాడని పేర్కొన్నారు. మరి రేపు విజయమ్మ, షర్మిల కూడా చంద్రబాబు చేతిలో పావులేనని అంటాడని సజ్జల రామకృష్ణారెడ్డిపై మండిపడ్డారు. సజ్జల లాంటి నీచ క్యారెక్టర్ పురాణాల్లో కూడా ఉండదని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. సజ్జల కామెంట్ల తాలూకు వీడియోను ట్వీట్ చేశారు.

నారసుర చరిత్ర.. జగనాసుర రక్తచరిత్ర

నారసుర చరిత్ర.. జగనాసుర రక్తచరిత్ర

అటు బుద్ధా వెంకన్న కూడా సజ్జలపై విరుచుకుపడ్డారు. "గతంలో నారాసుర చరిత్ర అని సిగ్గులేకుండా బురదజల్లారు. మరి మీ పత్రికకు ఉన్న దాని గురించి మాట్లాడడం మర్చిపోయావేం సజ్జలా?" అని ప్రశ్నించారు. "ఆ రోజు చంద్రబాబు చేయించారని చెప్పడానికి లేనిది.. ఇవాళ మీ ఇంటి ఆడబిడ్డ సునీత జగనాసుర రక్తచరిత్ర బయటపెడితే వచ్చిందా?" అంటూ మండిపడ్డారు.

సునీత వాంగ్మూలంతో..

సునీత వాంగ్మూలంతో..

వైఎస్ వివేకానంద హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకా కూతురు సునీతారెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కలకలం రేపింది. త‌న సోద‌రుడు, క‌డ‌ప ఎంపీ అవినాశ్ రెడ్డిపై విచార‌ణ చేయాలని లోక్ స‌భ స్పీక‌ర్ ఓంబిర్లాకు ఆమె రాసిన లేఖ‌ పెను దుమారమే రేపింది. రాష్ట్ర పోలీస్ బాస్ స్పందించారు. ఏపీ డీజీపీగా ఇటీవ‌లే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన రాజేంద్ర‌నాథ్ రెడ్డి.. వివేకా హ‌త్య, ఆ కేసు ద‌ర్యాప్తుపై కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసును సీబీఐ అధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నార‌ని రాజేంద్ర‌నాథ్ రెడ్డి చెప్పారు. ఈ కేసు ద‌ర్యాప్తులో తామేమీ క‌లుగ‌జేసుకోవ‌డం లేద‌ని కూడా తెలిపారు. ఈ కేసు ద‌ర్యాప్తులో రాష్ట్ర పోలీసుల‌పై ఎలాంటి ఒత్తిడి కూడా లేవ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని.. నిందితులకు శిక్ష పడుతుందని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+