ఐదారుగురు ఎవరు..? తిరిగి మంత్రి పదవీ వరించే వారు ఎవరు, కొడాలి నాని కామెంట్లపై చర్చ
ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులు అంతా రాజీనామా చేశారు. సీఎం జగన్ ముందే చెప్పినట్టు.. రెండున్నరేళ్లకు మంత్రులు తమ పదవులకు రిజైన్ సమర్పించారు. మొత్తం మంది రాజీనామా చేయడంతో.. మళ్లీ తిరిగి ఎవరికీ అవకాశం వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. దీనిపై కొడాలి నాని చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తొలుత 10 మందికి ఛాన్స్ ఇస్తామనే ప్రచారం జరిగింది. కానీ అదీ కాస్త తగ్గింది.

మీటింగ్‌లో నవ్వులు..
ఏపీ కేబినెట్‌లో మొత్తం 24 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించిన సంగతి తెలిసిందే. ఒక మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మారణంతో ఆయన మంత్రి పదవీకి రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ నెల 11వ తేదీన కొత్త కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉండనుంది. ఈ మేరకు మంత్రులకు సీఎం జగన్ వివరించారు. అంతకుముందు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మంత్రివర్గ సమావేశంలో నవ్వులు కురిశాయి.

ఐదారుగురు.. ఎవరంటే..?
అయితే మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత బయటకు వచ్చిన మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదుగురో, ఆరుగురో తిరిగి కొత్త మంత్రివర్గంలో పనిచేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. పనితీరులో సత్తా కనబరచిన వారో, అనుభవం ఉన్న సీనియర్లో, లేదంటే సామాజిక వర్గ సమీకరణాలో తెలియదు గానీ... ఇప్పుడు రాజీనామాలు చేసిన వారిలో ఓ ఐదారుగురు మంత్రులకు కొత్త కేబినెట్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.

సస్పెన్స్ కంటిన్యూ
కొడాలి నాని కామెంట్లతో ఏపీలో ఒక్కసారిగా చర్చకు దారితీసింది. కొత్త మంత్రివర్గంలో చోటు లభించే ఐదారుగురు పాత మంత్రులు ఎవరని ఎవరికి తోచిన లెక్కలతో వారు అంచనా వేస్తున్నారు. సామాజిక సమీకరణాలను వేసి మరీ కొందరు చర్చల్లోకి మునిగిపోయారు. ఆ ఐదారుగురు ఎవరనే విషయం మాత్రం జగన్ ప్రకటించే వరకు ఏ ఒక్కరికీ తెలియదనే చెప్పాలి. ఈ విషయాల్లో చాలా సీక్రెసీని జగన్ మెయింటైన్ చేస్తున్నారు. చివరి నిమిషం వరకు సస్పెన్స్ కొనసాగిస్తోన్న సంగతి తెలిసిందే.
Recommended Video

పార్టీ పదవులే.. మరీ ఎవరికీ
కీలక నేతలు, సీనియర్ నేతలకు ఇప్పటికే పార్టీ పదవీ అప్పగిస్తామని సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో బొత్స సత్యనారాయణ, పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారికి అవకాశం ఇచ్చే అవకాశం లేదు. పేర్ని నాని, కొడాలి నాని లాంటి వారికి కూడా పార్టీ జిల్లా అధ్యక్ష పదవీ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో మరీ ఆ ఐదారుగురు ఎవరనే డిస్కషన్ మాత్రం కంటిన్యూ అవుతుంది.