అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సడెన్‌‌గా సవాంగ్‌ను ఎందుకు మార్చారు, అదే కారణమా...? పవన్ కల్యాణ్ సందేహాం

|
Google Oneindia TeluguNews

డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ వ్యవహారం ఏపీలో కాక రేపుతోంది. దీనిపై రాజకీయ దుమారం చెలరేగింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఉన్నపళంగా డీజీపీని మార్చాల్సిన అవసరం ఏముందని అడిగారు. డీజీపీని బాధ్యతల నుంచి పక్కకు తప్పించడం విస్మయం కలిగించిందని పవన్ అన్నారు. అధికారులను నియమించుకోవడం అనేది ప్రభుత్వానికి ఉన్న పాలనాపరమైన అధికారం కానీ.. వైసీపీ ప్రభుత్వానికి డీజీపీని హఠాత్తుగా మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. ఇందుకు గల కారణాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఉద్యోగుల ర్యాలీ..

ఉద్యోగుల ర్యాలీ..

విజయవాడలో పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ర్యాలీ విజయవంతం అయినందుకే సవాంగ్ పై బదిలీ వేటు వేశారని భావించాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. ఉన్నతాధికారుల నుంచి చిన్నపాటి ఉద్యోగి వరకూ అందరినీ హెచ్చరించి.. భయపెట్టి అదుపు చేసేందుకు సవాంగ్ బదిలీని ఉదాహరణగా చూపించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందన్నారు. బదిలీ తీరు చూస్తే వైసీపీ ప్రభుత్వం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంని ఆకస్మికంగా పక్కకు తప్పించడమే గుర్తుకు వస్తుందన్నారు.

అనుమతి లేదు.. మరీ

అనుమతి లేదు.. మరీ

వాస్తవానికి ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని చెప్పినప్పటికీ భారీ సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ వచ్చారు. ఉద్యోగులు భారీగా తరలిరావడంతో ప్రభుత్వం తీవ్ర అసంతృప్తిగా ఉంది. దీనిపై డీజీపీ సవాంగ్.. సీఎం జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. ఇప్పుడు ఉన్నట్టుండి డీజీపీని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. రెండు రోజుల క్రితం ఏపీ సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇప్పుడు డీజీపీని ట్రాన్స్‌ఫర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అధికారులను బదిలీ చేస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న అనూహ్య నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి.

అన్న అని పిలిచే జగన్.. ఇలా

అన్న అని పిలిచే జగన్.. ఇలా

వాస్తవానికి "సవాంగ్ అన్నా" అంటూ సీఎం జగన్ ఆయనపై ఎంతో అభిమానం చూపిస్తుంటారు. అలాంటిది ఇప్పటికిప్పుడు ఆయనను జీఏడీకి బదిలీ చేయడం వెనుక కారణాలేంటో తెలియకపోవడంతో తీవ్ర చర్చ జరుగుతోంది. సవాంగ్ స్థానంలో ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డిని నూతన డీజీపీగా నియమించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని సవాంగ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గౌతం సవాంగ్ బదిలీ అంశం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సడెన్‌గా ఆయనను తప్పించడం చర్చకు దారితీసింది.

English summary
andhra pradesh dgp gautam sawang changed. janasena chief pawan kalyan suspected ys jagan government act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X