ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019:గుంతకల్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video

2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి వరకు గుత్తిగా ఉన్న ఈ నియెజకవర్గం అప్పటి నుండి గుంతకల్ గా మారింది. గుంతకల్లు, తాడిపత్రి నియోకవర్గంలో ఉన్న 9 గ్రామాలు, పామిడి మండలం ఈ నియోజకవర్గంలో చేరాయి. గుత్తి నియోజకవర్గంలో గాదె లింగప్ప మినహా మరెవరూ రెండు సార్లు గెలవలేదు. గాదె లింగప్ప కుమార్తె నీలావతి 2004 లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక్కడి నుండి ఒకసారి గెలిచిన నారయణప్ప, మరోసారి కళ్యాణదుర్గంలో గెలుపొందారు. ఇక్కడ ఒకసారి డికె వెంకటరెడ్డి మరోసారి తాడిపత్రి లో గెలిచారు. 2009 నుండి గుంతకల్ నియోజకవర్గంలో మొదటి సారి కాంగ్రెస్ అభ్యర్ది మధుసూధన్ రెడ్డి గెలవగా..రెండో సారి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ది జితేందర్ గౌడ్ గెలుపొందారు.
గుత్తి..గుంతకల్ లో 13 సార్లు ఎన్నికలు..
గుత్తి నియోజకవర్గంలో 11 సార్లు ఎన్నికలు జరిగాయి. అయిదు సార్లు కాంగ్రెస్ గెలవగా.. నాలుగు సార్లు టిడిపి గెలిచింది. సిపిఐ ఒకసారి, స్వతంత్రులు రెండు సారలు గెలిచారు. గుంతకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఒకసారి..వైసిపి ఒకసారి గెలుపొందాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి పోటీ చేసిన వెంకట్రామి రెడ్డి సోదరులు సాయిప్రసాదరెడ్డి ఆదోనిలోనూ.. మరో సోదరుడు మంత్రాలయంలోనూ గెలుపొందారు.

2014 లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో గుంతకల్ నియోజకవర్గం లో మొత్తం 232125 ఓటర్లు ఉండగా, అందులో 172152 ఓట్లు పోలయ్యాయి. కాగా, టిడిపి నుండి పోటీ చేసిన జితేందర్ గౌడ్‌కు 81655 ఓట్లు రాగా, వైసిపి అభ్యర్ది వెంకట్రామి రెడ్డికి 76561 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్య ర్ది జితేందర్ గౌడ్ 5094 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో టిడిపి -బిజెపి పొత్తులో భాగంగా ఇక్కడ తొలుత ఈ సీటును బిజెపికి కేటాయించారు. అయితే టిడిపి నుండి పోటీకి దిగిన జితేందర్ గౌడ్ తన నామినేషన్ ఉప సం హరించుకోకపోవటంతో ఆయన బరిలో నిలిచారు. ఎన్నికల్లో గెలిచారు. బిజెపి అభ్యర్ది డిపాజిట్ కోల్పోయారు.












Click it and Unblock the Notifications