RTC: ప్రయాణికులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ.. 10 శాతం రాయితీ..!
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రూట్ లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ పై 10 శాతం రాయితీ ప్రకటించింది. అయితే ముందుగా బుక్ చేసుకున్న వారికే ఈ రాయితీ వర్తించనుంది. డిస్కౌంట్ ఆఫర్ తిరుగు ప్రయాణానికి కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో ప్రయాణం చేస్తుంటారు. ఈ మార్గల్లో ఆర్టీసీ బస్సులు సరిగా ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ వాహనదారులు ప్రయాణికుల వద్ద భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల భారం తగ్గించడానికి ఆర్టీసీ అధిక సంఖ్యలో బస్సులు నడపడంతో పాటు రాయితీని ప్రకటించింది.

తెలంగాణ ఆర్టీసీ నిర్ణయంతో విజయవాడ రూట్‌లో ఒక్కో ప్రయాణికుడికి రూ.100 అదా కానుంది. తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ విజయవాడ మార్గంలో భారీగా బస్సులను పెంచింది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సును టీఎస్ ఆర్టీసీ నడుపుతోంది. ఈ రూటులో రోజు 120కి పైగా బస్సులను నడుపుతోంది. ఈ బస్సుల్లో లహరి ఏసీ స్లీపర్ బస్సులు 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ గరుడ బస్సులు 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జీరి 62 బస్సులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62… pic.twitter.com/nvG8kzoaRH
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 27, 2024
"హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది. తిరుగుప్రయాణ టికెట్ పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్ సైట్ http://tsrtconline.in ని సంప్రదించండి" అని సజ్జనార్ ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications