వార్2 కోసం జూనియర్ పారితోషికం
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ 2 వస్తోందన్న వార్త మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా హడావిడి మాములుగా లేదు. ఇంతవరకు ఎవరూ ఊహించని కాంబినేషన్ తెరపైకి వచ్చింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పెద్దలు కూడా దాన్ని కనిపెట్టలేకపోయారు. అగ్నిపర్వతం బద్ధలై లావా వెదజల్లినట్లుగా వార్త ప్రచారంలోకి రావడంతో ముంబయి మీడియా దీనికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది.
తారక్ తోపాటు హృతిక్ కలిసి నృత్యాలు, పోరాటాల్లాంటివి చూస్తే థియేటర్లలో అభిమానులు కుదురుగా కూర్చోవడం కూడా కష్టమేనంటున్నారు. ఇలా అంటూ అభిమానులు ట్వీట్లు చేయడం కూడా ప్రారంభించారు. అందరికీ అతిపెద్ద ప్రశ్నగా మారిందేమిటంటే.. వార్2 సినిమా కోసం జూనియర్ తీసుకుంటున్న పారితోషికం ఎంత?

ప్రస్తుతం జూనియర్ కు కేవలం పారితోషికమే రూ. 100 కోట్లు చెల్లించే రేంజ్ కు వెళ్ళినట్లు చెబుతున్నారు. దక్షిణాది పరిశ్రమలో అతి పెద్ద మొత్తం అందుకుంటున్న టాప్ 5 స్టార్స్ లో తారక్ ఒకరయ్యారు. వార్ 2 కోసం రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే ఇది ప్రత్యేక పాత్ర కోసమా లేక ఫుల్ ప్యాకేజ్ రూ.100 కోట్లు ఇచ్చి పూర్తి స్థాయి పాత్ర చేయిస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో యష్ రాజ్ స్పైవర్స్ హీరోలంతా క్యామియోల రూపంలో కనిపిస్తారని ఇప్పటికే పలు వార్తా ఛానళ్లలో హోరెత్తిపోతోంది.

ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. వార్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే స్టార్ డం నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుతుందని తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ ప్రాజెక్టు మీదే పూర్తిగా దృష్టి పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడో కమిటైన ప్రశాంత్ నీల్ సినిమా కన్నా ముందే వార్ 2 పూర్తి చేసే అవకాశాలున్నాయంటున్నారు.
పాత్ర పరిధి, ఎలాంటి క్యారెక్టర్ డిజైన్ చేశారనేది ఎవరికీ తెలియడంలేదు. తొలి బాలీవుడ్ స్ట్రెయిట్ డెబ్యూ కావడంతో యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఉత్కంఠతో ఉన్నారు. క్రేజీ మూవీ కాబట్టి పఠాన్ కు మించిన వసూళ్లు నమోదవుతాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications