ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్- బడ్జెట్ లో ఇవ్వకున్నా 28,785 కోట్లు..!
ఆంధ్రప్రదేశ్ కు ఈసారి బడ్జెట్ లో అరకొర కేటాయింపులే ఉన్నాయని బాధపడుతున్న తరుణంలో 16వ ఆర్ధిక సంఘం (16th finance commission) భారీ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్దాయిలో కేటాయింపులు చేసేలా కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల్ని కేంద్రం అమలు చేస్తే రాష్ట్రానికి రూ.28785 కోట్ల నిధులు అందబోతున్నాయి. వీటి సాయంతో రాష్టంలో స్థానిక సంస్థలు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం గ్రాంట్లు అందించే విషయంలో ఆర్ధిక సంఘం సిఫార్సులు కీలకమైనవి. ఈ మేరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఈసారి రూ.28785 కోట్ల నిధులు కేటాయించాలని ఆర్ధికసంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఇందులో గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.16,627కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.12,158 కోట్లు ఇవ్వాలని సూచించింది. దీన్ని కేంద్రం అమలు చేస్తే రాష్ట్రానికి భారీ ప్రయోజనం కలగబోతోంది.

మరోవైపు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో ఇప్పటివరకూ 60-40 శాతంగా ఇస్తున్న జాతీయ స్థాయి గ్రాంట్ కాస్తా ఇప్పుడు 80-20 శాతాలుగా మార్చారు. అలాగే గ్రామీణ జనాభా ఆధారంగా 90-10 నిష్పత్తిలో దీన్ని కేటాయించాలని కూడా కేంద్రానికి సూచించింది. ఇలా వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి రూ.7,91,493 కోట్లు ఇవ్వాలని సూచించింది. ఇలా పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల్లో 50 శాతం పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణకు, నీటి నిర్వహణకు వాడాలని ప్రతిపాదించింది. మిగతా 50 శాతంలో రోడ్ల నిర్మాణం, నిర్వహణకు 20 శాతం కంటే ఎక్కువ వాడకుండా పరిమితి విధించింది. అలాగే విపత్తుల నిర్వహణ కోసం రాష్ట్రాలకు 2 లక్షల కోట్లు సిఫార్సు చేయగా.. ఇందులో కేంద్రం వాటా లక్షన్నర కోట్లు. మిగిలింది రాష్టాలు భరించాలి. ఇందులో ఏపీకి రూ.8,166 కోట్లు సిఫార్సు చేసింది.
-
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
ఏపీ ఉద్యోగులకు గుడ్ న్యూస్-బకాయిలపై చంద్రబాాబు ఆదేశాలు..! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం క్లారిటీ..! లెక్కలతో సహా..! -
కేంద్రం వరాల సునామీ -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా!












Click it and Unblock the Notifications