ఏపీలో కొత్తగా 2690 కరోనా కేసులు, 9 మంది మృతి: 70వేలకు యాక్టివ్ కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,598 నమూనాలు పరీక్షించగా.. 2690 మందికి కరోనా సోకినట్లు తేలింది. ఇక అంతకుముందు రోజున 3,396 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంటే, నిన్నటికి ఇవాళ్టికి 706 కేసులు తగ్గాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,03,455 మంది కరోనా బారిన పడ్డారు.

గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది కరోనాకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,664కు చేరింది. కోవిడ్ వల్ల ప్రకాశంలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, విజయనగరంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 11,855 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నారు.

 2690 new coronavirus cases, 9 deaths reported in andhra pradesh.

తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో కరోనా నుంచి రికవరీ అయిన వారి సంఖ్య 22,19,219 లకు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 69,572 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు వివరాలను ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ ఆదివారం సాయంత్రం వెల్లడించింది.

జిల్లాల వారీగా కరోనా కేసులు గమనించినట్లయితే.. ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 518 కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత గుంటూరు జిల్లాలో 354 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక, అనంతపురం జిల్లాలో 140, చిత్తూరులో 131, వైఎస్ఆర్ కడపలో 181, కృష్ణాలో 352, కర్నూలులో 147, నెల్లూరులో 123, ప్రకాశంలో 156, శ్రీకాకుళంలో 36, విశాఖపట్నంలో 198, విజయనగరంలో 56, పశ్చిమ గోదావరిలో 298 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

మరోవైపు, దేశంలోనూ కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కేసుల క్రమంగా సంఖ్య తగ్గింది. దేశంలో నిన్న 1,07,474 క‌రోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న క‌రోనా నుంచి 2,13,246 మంది కోలుకున్నారని తెలిపింది. క‌రోనాతో మరో 865 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మర‌ణాల సంఖ్య‌ 5,01,979కు పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 7.42 శాతంగా ఉంది. దేశంలో ప్ర‌స్తుతం 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 1,69,46,26,697 డోసుల వ్యాక్సిన్లు వేశారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్నా కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని అటు ప్రభుత్వాలు, ఇటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+