ఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు చోటు చేసుకున్నాయి. ఏకంగా 30 మంది ఐపీఎస్‌లకు స్థానం చలనం కలిగింది. వీరందరికి బదిలీలు, పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే ఐఏఎస్‌ల బదిలీలు జరిగిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో బదిలీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

30 ips officers transferred in andhra pradesh

బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల జాబితా:

రైల్వే పోలీస్ అదనపు డీజీగా కుమార్ విశ్వజిత్
ఏపీఎస్పీ అదనపు డీజీగా అతుల్ సింగ్
అక్టోపస్ ఐజీగా సీహెచ్ శ్రీకాంత్ (రోడ్డు సేఫ్టీ అథారిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు)
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఐజీగా కొల్లి రఘురామి రెడ్డి(డ్రగ్స్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు)
సీఐడీ ఐజీగా సర్వశ్రేష్ఠ త్రిపాఠి
పోలీసు సిబ్బంది వ్యవహారాల ఐజీగా హరికృష్ణ (టెక్నికల్ సర్వీసెస్ ఐజీగానూ అదనపు బాధ్యతలు)

అక్టోపస్ డీఐజీగా సెంథిల్ కుమార్ (శాంతిభద్రతల డీఐజీగానూ అదనపు బాధ్యతలు)
పోలీసు శిక్షణ డీఐజీగా రాహుల్ దేవ్ శర్మ
విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని
కర్నూలు రేంజ్ డీఐజీగా విజయరావు
విశాఖ సంయుక్త పోలీస్ కమిషనర్‌గా ఫకీరప్ప
కృష్ణా జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీం ఆస్మి
ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ కమాండెంట్ గా అమిత్ బర్దార్

ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్
పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా హజిత్ వేజెండ్ల
రాజమండ్రి విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్‌గా సుబ్బారెడ్డి
కౌంటర్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా వై రిశాంత్ రెడ్డి (ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీగానూ అదనపు బాధ్యతలు)

చిత్తూరు ఎస్పీగా జోషువా
ఏసీబీ ఎస్పీగా రవిప్రకాశ్
విశాఖ శాంతిభద్రతల డీసీపీగా సీహెచ్ మణికంఠ
ఏపీఎస్పీ ఐదో బెటాలియన్ కమాండెంట్‌గా అదిరాజ్ సింగ్ రాణా
కాకినాడ మూడో బెటాలియన్ కమాండెంట్‌గా కృష్ణకాంత్ పటేల్
గుంటూరు ఎస్పీగా తుషార్

జగ్గయ్యపేట డీసీపీగా కే శ్రీనివాసరావు
రంపచోడవరం ఏఎస్పీగా కే ధీరజ్
పాడేరు ఏఎస్పీగా ఎ జగదీశ్
విజయవాడ లా అండ్ ఆర్డర్ డీసీపీగా ఆనంద్ రెడ్డి
విశాఖ డీసీపీగా సత్యనారాయణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+