ఈ సీజన్లో 38లక్షల పెళ్ళిళ్ళు.. ఎంత బిజినెస్ జరుగుతుందో తెలిస్తే అవాక్కవుతారు!!

కొంత విరామం తరువాత తెలుగు రాష్ట్రాలలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది.. పెళ్లిళ్ల సీజన్ అంటే చిరు వ్యాపారి నుంచి మాల్స్ దాకా, కూలీ నుంచి కార్పొరేట్ వ్యాపారి వరకు అందరూ అందరికీ పండగే. ఎందుకంటే పండగల సమయంలో కన్నా కూడా వివాహాల సమయంలో రికార్డు స్థాయిలో బిజినెస్ జరగనుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT సంస్థ చెప్తుంది.

జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే వివాహ సమయంలో ప్రతి ఒక్కరూ తమశక్తికి మించి ఖర్చు చేస్తుంటారు. కట్న కానుకలు, భోజనాలు, పెట్టి పోతలు, అలంకరణ వంటి ఏ ఒక్క విషయం లోనూ రాజీ పడకుండా తమ పిల్లలకు అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు జరిపిస్తారు. వివాహాల సమయంలో జరిగే ఈ వ్యాపారాన్ని బట్టి ఒక్కోసారి వ్యాపారుల తల రాతలే మారిపోతుంటాయి.

38 lakh weddings in this season.. you will be surprised with the business this time

అందుకే ప్రతి వ్యాపారి పెళ్లిళ్ల సీజన్ కోసం ఎదురు చూస్తుంటారు.. దీపావళి లగ్గాలుగా పిలిచే ఈ సీజన్ లో కూడా ఈ ఏడాది వ్యాపారం భారీగానే జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ చెప్తోంది. గత ఏడాది ఇదే సీజన్ లో దాదాపు 32 లక్షల వివాహాలు జరగగా వాటి ద్వారా 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరిగినట్లు ఆ సంస్థ తెలిపింది.

38 lakh weddings in this season.. you will be surprised with the business this time

అయితే ఇదే సీజన్ లో వచ్చే 25 రోజుల్లో జరిగే పెళ్లిళ్ల ద్వారా అంతకు మించిన వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నట్లు ఆసంస్థ అంచనా వేస్తోంది. ఈ సీజన్లో నవంబర్ 23 నుంచి డిసెంబర్‌ 15వ తేదీ వరకు మొత్తం 11మంచి రోజుల్లో 38లక్షల వివాహాలు జరిగే అవకాశం ఉందని CAIT అంచనా వేసింది.

38 lakh weddings in this season.. you will be surprised with the business this time

గతేడాది 32 లక్షల వివాహాలు జరిగితేనే 3.75 లక్షల కోట్ల వ్యాపారం జరగగా, ఈ ఏడాది మరో 6లక్షల వివాహాలు అదనంగా జరుగుతుండటం తో వ్యాపారం 4లక్షల కోట్లకు మించి జరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.. ఇప్పటికే ప్రారంభం అయిన పెళ్ళిళ్ళు చూస్తుంటే ట్రేడర్స్ అంచనాలు నిజమయ్యే లా కనిపిస్తున్నాయి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+