ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: పెరిగిన రికవరీ, యాక్టివ్ కేసుల తగ్గుముఖం

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత కొద్ది రోజులుగా కరోనా కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య ఐదువేలకు మించడం లేదు. కరోనా కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. పరీక్షలు తగ్గించనప్పటికీ కేసులు మాత్రం పెరగడం లేదు.

ఏపీలో కొత్తగా 3892 కరోనా కేసులు.. 28 మంది మృతి

ఏపీలో కొత్తగా 3892 కరోనా కేసులు.. 28 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 69,463 పరీక్షలు నిర్వహించగా కొత్త 3892 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,465కు చేరింది. ఒక్క రోజు వ్యవధిలో 28 మంది మరణించారు. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా మరణాలు

జిల్లాల వారీగా మరణాలు

జిల్లాల వారీగా కొత్త మరణాలు గమనించినట్లయితే.. చిత్తూరులో నలుగురు, కృష్ణాలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పుగోదావరిలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, అనంతపురంలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూలులో ఒక్కరు, వియజనరగంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 6319కి చేరింది.

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులు

ఏపీ జిల్లాల వారీగా కొత్త కేసులు

జిల్లాల వారీగా కొత్త కరోనా కేసులను గమనించినట్లయితే.. అనంతపురంలో 190, చిత్తూరులో 255, తూర్పుగోదావరిలో 296, గుంటూరులో 256, కడపలో 139, కృష్ణాలో 375, కర్నూలులో 92, నెల్లూరులో 137, ప్రకాశంలో 33, శ్రీకాకుళంలో 94, విశాఖపట్నంలో 48, విజయనగరంలో 100, పశ్చిమగోదావరిలో 181 కేసులు నమోదయ్యాయి.

తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు

తగ్గుతున్న కరోనా యాక్టివ్ కేసులు

గడిచిన 24 గంటల్లో 5050 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 7,16,582కు చేరింది. ఇప్పటి వరకు

67,72,273 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 41,669 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు దేశంలో 72,51,918 కరోనా కేసులు నమోదు కాగా, 63,14,541 మంది కోలుకున్నారు. 1,10,724 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుతం దేశంలో 8,25,545 యాక్టివ్ కేసులున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+