ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా: కొత్త కేసుల కంటే రికవరీనే ఎక్కువ, ఇది మంచివార్తే

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా రోజుకు 9-10వేలు కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా, ఆ సంఖ్య తగ్గింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్‌లో కొత్త కేసులకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా

ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా

ఈ బులిటెన్ ప్రకారం.. ఒక్క రోజులు రాష్ట్రంలో 61,529 నమూనాలను పరీక్షించగా.. 7956 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 5,75,079కి చేరింది. మరణాల సంఖ్య కూడా కొంత మేర తగ్గింది. గత 24 గంటల్లో 60 మంది మృతి చెందారు.

జిల్లాల వారీగా మరణాలు.. 4972కు చేరిక

జిల్లాల వారీగా మరణాలు.. 4972కు చేరిక

జిల్లాల వారీగా మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో 9 మంది, అనంతపురంలో 7, కర్నూలులో 5, ప్రకాశం 5, విశాఖపట్నం 5, తూర్పుగోదావరి, కడప, కృష్ణ, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించినవారి మొత్తం సంఖ్య 4972కు చేరింది.

కొత్త కేసులు జిల్లాలో.. తూర్పుగోదావరిలోనే అధికం

కొత్త కేసులు జిల్లాలో.. తూర్పుగోదావరిలోనే అధికం

జిల్లాల వారీగా కొత్త కేసులు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరిలో 1,412,
కర్నూలులో 341, పశ్చిమగోదావరిలో 1,091, చిత్తూరులో 748,
అనంతపురంలో 483, గుంటూరులో 666, ఃవిశాఖపట్నంలో 490, నెల్లూరులో 756,
ప్రకాశంలో 444, కడపలో 326, శ్రీకాకుళంలో 517, విజయనగరంలో 481,
కృష్ణా జిల్లాలో 201 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 78,220 కరోనా పాజిటివ్ కేసులున్నాయి.

కొత్త కేసుల కంటే రికవరీనే అధికం..

కొత్త కేసుల కంటే రికవరీనే అధికం..

ప్రస్తుతం రాష్ట్రంలో 93,204 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 9764 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే కూడా రికవరీ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటం శుభపరిణామమనే చెప్పాలి. కాగా, రాష్ట్రంలో ఇప్పటి వరకు 4,76,903 మంది కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 46,61,355 నమూనాలను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలో జాబితాలో ఏపీ రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో 10 లక్షలకుపైగా కేసులతో మహారాష్ట్ర కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+