సంక్రాంతి పండుగకు సామాన్యులకు బిగ్ షాక్!

సహజంగా పండుగలు వచ్చాయంటే సామాన్య, మధ్య తరగతి ప్రజలు సంతోషంగా పండుగలు జరుపుకోవాలని భావిస్తారు. ఉన్నత వర్గాల వారు షాపింగ్ చేయాలన్నా, ఇష్టమైనవి కొనుక్కొని తినాలన్నా, ఎటైనా వెళ్లాలి అన్నా పండుగలతో సంబంధం లేకుండా చేయొచ్చు. కానీ సామాన్య కుటుంబాలు మాత్రం సంతోషంగా గడపడానికి పండుగల కోసం ఎదురు చూస్తారు. ఇక అటువంటి పండుగలు సామాన్యులకు ఊహించని షాక్ ఇస్తున్నాయి.

భారీగా మటన్, చికెన్ ధరలు
ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టు ప్రస్తుతం పరిస్థితి తయారైంది. నిత్యవసర వస్తువుల ధరలు కొండెక్కి కూర్చోగా, పండుగ పూట చికెన్, మటన్ తినాలి అనుకునే వారికి సైతం షాక్ తగులుతోంది. సంక్రాంతి పండుగకు చికెన్ ధరలు 300 రూపాయలు, మటన్ ధరలు వెయ్యి రూపాయల నుండి 1200 రూపాయల వరకు అమ్ముడు అవుతున్నాయి.

A big shock for the common people this Sankranthi festival rates hike on chicken and mutton too

సినిమా టికెట్ల ధరలు, బస్సుల చార్జీల బాదుడుతో షాక్
పండుగకు అమాంతం ధరలను పెంచిన దుకాణం దారులు ప్రజలు చచ్చినట్టు కొనుగోలు చేస్తారని భావిస్తున్నారు. ఇక ఇప్పటికే పండుగకు సినిమా చూడాలని వెళ్లాలనుకున్న వారికి సైతం కొత్త సినిమాల టికెట్లు భారీగా ధరలు పెరగడంతో చూడలేని పరిస్థితి ఉంది. ఒకవైపు సినిమా టికెట్ల ధరలు పెరగడం, ఇంకోవైపు పండుగకు సొంత ఊర్లకు వెళ్లే వారికి బస్సులలో అదనపు చార్జీల బాదుడు వెరసి సామాన్యులు లబోదిబోమంటున్నారు.

ప్రజల పేదరికాన్ని వెక్కిరిస్తున్న పండుగలు
పండుగలు తమ పేదరికాన్ని మరింత వెక్కిరిస్తున్నాయి అని బాధపడుతున్నారు. పండుగ సమయంలో కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సామాన్యులకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, సంక్షేమ పథకాల పేరుతో పండుగలకు బహుమతులు ఇస్తున్నాం.. సామాన్య ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతున్నాం అని చెబుతున్న ప్రభుత్వాలు ధరల కట్టడిలో మాత్రం విఫలమవుతున్నాయి.

ధరల శరాఘాతంతో సంక్రాంతికి సామాన్యుల కన్నీరు
ఫలితంగా పండుగ వస్తే చాలు ఇష్టారాజ్యంగా నిత్యవసర వస్తువుల ధరల నుండి కూరగాయల ధరలు, మాంసం ధరలు, సినిమా టికెట్ల ధరలు, బస్సు ప్రయాణం టికెట్ల ధరలు.. ఇలా అన్ని ధరలు పెరిగిపోతున్నాయి. ఇక పండుగలు ఎందుకు వస్తున్నాయి అనే భావనను కలిగిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ కూడా చాలామంది పేద, మధ్య తరగతి ప్రజలకు ధరల శరాఘాతంతో కన్నీరు తెప్పిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+