బాబంటే భయం... ఎందుకంటే?... చంద్రబాబు మీద వైరల్ అయిన ఒక వీరాభిమాని పోస్టు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి చాలా మంది వీరాభిమానులున్నారు...నిజానికి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడిగా రాజకీయాల్లో ప్రవేశించి ఏకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన ఎన్టీఆర్ తో పోలిస్తే...అనూహ్యంగా ఆయన్నుసిఎం పదవి నుంచి తప్పించి తాను ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన చంద్రబాబుకు...ఏ రకంగా చూసినా ఎన్టీఆర్ కు ఉన్నంత జనాకర్షణ, ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగినవాడు కాదు.

Recommended Video

    Union Budget 2018 : బడ్జెట్ సూపర్, బాబుకు కౌంటర్

    అంతేకాదు...మొదట్నుంచి చూస్తే చంద్రబాబుకు...ఎన్టీఆర్ అంతటి వాగ్ధాటి గాని, వర్చస్సు ఉన్నవాడు కూడా కాదు...అలాగే చాలా చిన్న కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి. చంద్రబాబుకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆయనకున్నదంతా తాను స్వయంగా రూపొందించుకున్న రాజకీయ నేపథ్యమే. అయితే రాజకీయాల ద్వారా వీరాభిమానులను సమకూర్చుకోవడం చాలా చాలా కష్టం. ఫైనల్ గా చూస్తే...చంద్రబాబు ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

    A Chandrababu Naidu fan's post goes Viral On Social Media

    చంద్రబాబు ఓవరాల్ సక్సెస్ కు...ఇంకా చెప్పాలంటే...రాజకీయాల్లో చంద్రబాబు నిలదొక్కుకోవడానికి...ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి...దేశ రాజకీయాల్లో సైతం కీలక పాత్ర పోషించేంతగా ఎదగడానికి...వీటన్నింటికి...ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోవడానికి...వీటన్నింటికి వెనుక ప్రధాన కారణం...ఒక్కటే...అంటే ఆశ్చర్యంగా అనిపించినా అదే నిజం...ఆ కారణం...హార్డ్ వర్క్...

    చంద్రబాబు కష్టజీవిగా పేరు తెచ్చుకున్నారు. తాను ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆయన అహర్నిశలు తపిస్తారు...అంతకంటే ఎక్కువగా శ్రమిస్తారు. లక్ష్యం పట్ల నిబద్దత, క్రమశిక్షణ, సింప్లిసిటి, ఎండనక వాననక...పగలనక రేయనక నిర్విరామంగా కష్టపడటం...ఇదే ఆయనలో చాలా మందికి నచ్చేది...చాలామంది అభిమానుల్ని సంపాదించి పెట్టింది. అందులో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. అలాంటి ఒక వీరాభిమాని తన అభిమాన నేత చంద్రబాబు గురించి రాసిన ఒక వెరైటీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తోంది...అందులోను ఆ ఫ్యాన్ పోస్టు రాయడం కూడా వెరైటీగా రాయడంతో ఎక్కువమంది ని ఆకట్టుకుంది...ఇంతకీ ఆ ఫ్యాన్..ఆ పోస్టులో చంద్రబాబు అందరికి ఎందుకు నచ్చుతాడో రాయలేదు...ఎందుకు నచ్చడో రాశాడు...మరి అదే విశేషం...అయితే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ పోస్ట్ చూసేయండి మరి...

    >>చంద్రబాబు అభివృద్ధి చెందితే ప్రధాని పదవికి పోటీ వస్తాడని మోదీకి భయం

    >>ఆంధ్రా అభివృద్ధి చెందితే గుజరాత్ కు పోటీ వస్తుందని అమిత్ షా కి భయం

    >>అమరావతి అభివృద్ధి చెందితే హైదరాబాద్ ఖాళీ అవుతుందని కేసీఆర్ కి భయం

    >>పోలవరం పూర్తయితే తన ఉనికికే ప్రమాదమని జగన్ కి భయం

    >>విశాఖ కు రైల్వే జోన్ వస్తే తమ ఆదాయం పోతుందని ఒడిస్సాకి భయం

    >>ఆంధ్రా పారిశ్రామికం గా వృద్ది చెందితే పెట్టుబడులు రావని తమిళనాడుకి భయం

    >>ఆంధ్రా ఐ టి రంగం లో వృద్ది చెందితే తమకు పోటీ వస్తుందని కర్నాటకకి భయం

    >>తెలుగుదేశం పాతుకుపోతే మళ్ళీ తనకు ఛాన్స్ రాదేమోనని పవన్ కి భయం

    >>చంద్రబాబు ద్వారా తృతీయ ఫ్రంట్ ఏర్పడితే తమ పరిస్థితి ఏమిటని రాహుల్ గాంధీకి భయం

    >భయం.భయం..భయం...ఇలా చంద్రబాబంటే అందరికీ భయమే

    >>కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకూ ఒక భయముందీ...
    ...
    ...
    >>అది 2019లో చంద్రబాబు రాకుంటే ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆగిపోతుందేమోనని...అరాచకపుశక్తులు విజృంభిస్తాయేమోనని.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+