Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారయత్నం, సోషల్ మీడియాలో పోస్ట్

ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.అంతేకాదు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఒంగోలు: ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.అంతేకాదు ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ విద్యార్థిని తన తోటి విద్యార్థులను నమ్మింది.అయితే ఆమె నమ్మకాన్ని ఆమె
స్నేహితులు వమ్ము చేశారు. ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించారు.ఈ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాదు బాధితురాలిని బ్లాక్‌మెయిల్ చేశారు.

A Degree student complaint against sexual harassment in Kanigiri

బాధిత విద్యార్థినికి కార్తీక్‌ అనే యువకుడు లవర్‌.. అయితే, అమ్మాయి పట్ల అనుమానంతో అతను ఇటీవల పైశాచికంగా వ్యవహరిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇటీవల కనిగిరిలోని సమీపంలో ఉన్న పంటపొల్లాల్లోకి స్నేహితులతో కలిసి అమ్మాయిని తీసుకెళ్లాడు. అక్కడ కార్తీక్‌ అత్యంత పైశాచికంగా వ్యవహరించాడు. అమ్మాయిపైకి సాయి అనే యువకుడిని ఉసిగొల్పాడు. అత్యంత అమానుషంగా దారుణంగా అమ్మాయిపై సాయి కీచక చర్యకు పాల్పడుతుండగా.. కార్తీక్‌, అతని స్నేహితులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారని సమాచారం. అమ్మాయికి తోడుగా వచ్చిన మరో విద్యార్థిని ఈ ఘటనను నిలువరించే ప్రయత్నం చేసినా ఆ కీచకులు వెనుకకు తగ్గలేదు.

ఆ వీడియో దృశ్యాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో దృశ్యాలు వేగంగా స్ప్రెడ్‌ కావడంతోపాటు బాధితురాలి కుటుంబసభ్యుల దృష్టికి రావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.ఈ అమానుషానికి ఒడిగట్టిన కార్తీక్‌, ఇతర నిందితులపై అత్యాచారయత్నంతోపాటు వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదుచేసిన పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+