రైతు పొలంలో తళుక్కుమన్న వజ్రం.. పంట పండింది.. ఎంత ధర పలికిందంటే!!

తొలకరి జల్లులు కురిస్తే అందరూ వ్యవసాయ పనులు మొదలు పెట్టాలని, ఏరువాకా సాగాలని భావిస్తారు. కానీ ఒకప్పటి రతనాల సీమ రాయలసీమలో మాత్రం వజ్రాల కోసం వేట మొదలుపెడతారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలలో ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. వజ్రాల వేట కోసమే వివిధ ప్రాంతాల నుండి ఈ సమయంలో రాయలసీమకు వెళ్ళే వారు ఉన్నారు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

తొలకరి వర్షాల వేళ వజ్రాల వేట
తొలకరి వర్షాలు కురిసే వేళ ఎవరో నక్క తోక తొక్కిన వారికి వజ్రాలు ఒక్కసారి తళుక్కుమంటాయి. ఒక్క వజ్రం దొరికితే చాలు దరిద్రం పోయి లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారుతుంటారు. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం అక్కడ చోటు చేసుకుంటున్నాయి.

A diamond found to a Kurnool district farmer this is the value of the diamond

కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన వజ్రం
కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా అక్కడి స్థానికులు వజ్రాల వేట ప్రారంభించారు. తొలకరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వజ్రాల కోసం ఆశగా వెతుకుతున్నారు . ఒక వజ్రం దొరికిన చాలు జీవితం మారిపోతుందని అక్కడ వారందరూ భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వజ్రాల కోసం వెతుకుతున్నారు .అయితే తాజాగా అదృష్టం వజ్రం రూపంలో ఒక రైతును వెతుక్కుంటూ వచ్చింది.

ఆ వజ్రం ధర ఎంత పలికిందంటే
కర్నూలు జిల్లా మద్దెకర మండలం హంపా గ్రామంలో రైతు పొలం పనులు చేసుకుంటుండగా అతనికి ఓ వజ్రం దొరికింది. ఆ వజ్రాన్ని రైతు నుండి పెరవలి కి చెందిన ఒక వ్యాపారి వేలంపాటలో ఐదు లక్షల రూపాయలు, రెండు గ్రాముల బంగారానికి దక్కించుకున్నాడు. అయితే బయట మార్కెట్లో ఆ వజ్రం విలువ చాలా ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అనంతలోనూ వజ్రాల కోసం వేట
ఒక్క కర్నూలు జిల్లాలో మాత్రమే కాకుండా వజ్రాల కోసం అనంతపురం జిల్లాలో కూడా వేట కొనసాగుతుంది. అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు, ఊటకల్లు, బేతపల్లి , బసినేపల్లి తదితర ప్రాంతాలలో వజ్రాల కోసం వేట సాగిస్తున్నారు. ఇక వజ్రాల వ్యాపారులు కూడా ఈ సీజన్లో ఈ జిల్లాల బాట పడతారు. గుట్టుచప్పుడు కాకుండా స్థానికులకు దొరికిన వజ్రాలను కొనుగోలు చేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+