Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధర.. కిలో 30 రూపాయలే..!
వారం రోజుల కిందటి వరకు భారీగా పెరిగిన టమాటా ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. 15 రోజుల ముందు వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో కిలో టమాటా కిలో రూ.250 నుంచి రూ.300 వరకు పలికింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 150 నుంచి రూ.200 వరకు పలికింది. కానీ గత వారం రోజులుగా టమాటా దిగుబడి పెరడంతో ధరలు తగ్గుతున్నాయి. గత సోమవారం హైదరాబాద్ లోని పలు రైతు బజారుల్లో కిలో టమాటా రూ.63 నుంచి రూ.70 పలికింది. సోమవారం 2450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. దీంతో టమాటా ధర తగ్గింది.
రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, కర్ణాటక నుంచి భారీగా టమాటా రావడంతో ధర తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇటు తెలంగాణలోనూ టమాటా దిగుబడి పెరిగింది. హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలైన రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాల నుంచి కూడా టమాటా అధికంగా వచ్చింది. తాజా ఏపీలోని మదనపల్లె మార్కెట్ టమాటా ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం మార్కెట్ కు దాదాపు 4000 కిలోల టమాటా రావడంతో ధరలు పడిపోయాయి. మొదటి రకం టమాటా కిలో రూ.30 నుంచి రూ.40 పలికింది.

ఇక రెండో రకం టమాటా కిలో రూ. 21 నుంచి రూ.28 వరకు పలికింది. వ్యాపారులు టమాటా సగటు ధర రూ.26 నుంచి 28 లకు కొనుగోలు చేసినట్లు మార్కెట్ అధికారి తెలిపారు. ఇక గురువారం కూడా టమాటా ధర తగ్గిన విషయం తెలిసిందే. మంచి రకం టమాటాకు కిలో రూ. 50 నుంచి రూ.64 పలుకగా.. నాణ్యత తక్కువగా ఉన్న టమాటా ధర కిలో రూ. 36 నుంచి రూ.48 వరకు పలికింది. టమాటా దిగుబడి పెరుగిందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటా ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
రైతు బజార్, మార్కెట్ లో కిలో రూ. 30 నుంచి రూ.40 పలుకుతున్న టమాటా రిటైల్ లో మాత్రం కిలో రూ. 60 నుంచి రూ.80 పలుకుతోంది. ఆగస్టు చివరి వరకు టమాటా ధర రూ. 20 నుంచి 30 వరకు తగ్గే అవకాశం ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో టమాటా ధరలు తక్కువగా ఉండడంతో రైతులు బయట కొనుకోవచ్చని భావించేవారు. కానీ ధర భారీగా పెరగడంతో దాదాపు రైతులందరూ కొంత మొత్తంలో టమాటా సాగు చేసుకున్నారు. ఇలా దిగుబడి పెరగడంతో టమాటా ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.












Click it and Unblock the Notifications