విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వివాహేతర బంధం: ఐఏఎస్ అధికారి సోదరి అదృశ్యం, పోలీసుల అదుపులో మాజీ ఎమ్మెల్యే కుమారుడు

|
Google Oneindia TeluguNews

కృష్ణా: విజయవాడ నగరంలోని మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఐఏఎస్ అధికారి సోదరి, వైద్యురాలు సూర్యకుమారి అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. విస్సన్నపేటలోని ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న ఆమె.. కర్ణాటక కేడర్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి సోదరి.

కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సూర్యకుమారి అదృశ్యంపై విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే జయరాజ్ కుమారుడు విద్యాసాగర్‌ను ప్రశ్నిస్తున్నారు. సూర్యకుమారి రెండ్రోజుల క్రితం విద్యాసాగర్ ఇంటికి వెళ్లినట్లు సమాచారం.

A lady doctor missing in Vijayawada

ఈ నేపథ్యంలో అతడి ఇంట్లో సోదాలు చేపట్టారు పోలీసులు. సీసీ ఫుటేజీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, రెండ్రోజుల క్రితం సూర్యకుమారి తమ ఇంటికి వచ్చారని, అయితే, ఆమె అక్కడ్నుంచి వెంటనే వెళ్లిపోయినట్లు విద్యాసాగర్ తల్లి, భార్య తెలిపారు.

పోలీసులు వచ్చి విద్యాసాగర్‌ను తీసుకెళ్లారని, తీవ్రంగా కొట్టారని తెలిపారు. కాగా, సూర్యకుమారి, విద్యాసాగర్ మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు తెలిసింది. అయితే, విద్యాసాగర్‌కు ఇప్పటికే వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, విద్యాసాగర్‌ను పెళ్లి చేసుకోవడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదని సూర్యకుమారి మెసేజ్ పెట్టినట్లు సమాచారం.

'నేను వెళ్లిపోతున్నా, నిన్ను ఎంతోగానో ఇష్టపడ్డా.. పెళ్లి చేసుకోవాలని వెంటపడ్డా.. నీవు జాగ్రత్త' అని విద్యాసాగర్‌కు చివరి సారిగా పంపిన మెసేజ్‌లో సూర్యకుమారి పేర్కొంది. కాగా, రెండ్రోజుల క్రితం అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో సూర్యకుమారి తమ ఇంటికి వచ్చినట్లు విద్యాసాగర్ తల్లి తెలిపింది. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ ఇంట్లోకి వచ్చినట్లు తెలిపింది. 5నిమిషాల్లో తనను పంపించివేస్తానని తమకు విద్యాసాగర్ చెప్పినట్లు అతని భార్య చెప్పింది.

గతంలో కూడా పలుమార్లు వద్దని వారించామని విద్యాసాగర్‌కు సూచించినట్లు ఆయన భార్య చెప్పారు. కాగా, విద్యాసాగర్‌ను సాయంత్రంలోగా పోలీసులు విడుదల చేయకుంటే.. స్టేషన్ ముందు పిల్లలతోపాటు ఆత్మహత్యకు పాల్పడతామని విద్యాసాగర్ భార్య పేర్కొంది.

English summary
A lady doctor, who is sister of a IAS officer, missing in Vijayawada two days back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X