అమ్మ రా అంటూ... జైలులో ఉన్న తల్లి కోసం గుక్కపెట్టి ఏడ్చిన చిన్నారి...(వీడియో)
ఏ బిడ్డ అయినా అమ్మకాసేపు కనిపించకపోతే విలవిలలాడిపోతుంది. అలాంటిది తనను ఒదిలి ఏకంగా ఆ తల్లి జైలుకెళితే ఆ బిడ్డ పరిస్థితి ఏంటీ.. ఇలాంటి హృదయ విదారకర ఘటనే ఇప్పడు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఏ తప్పు చేసిందో తెలియదు కానీ, ఓ తల్లి జైలు పాలయ్యింది. కన్నతల్లి లేకపోయేసరికి ఆ బిడ్డ ఒంటరిదిపోయింది. జైల్లో ఉన్న కన్నతల్లి కోసం ఆ చిన్నారి పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. ఆ ఘటనను చూసిన ప్రతి ఒక్కరి కంట కన్నీరే.
ఈ సంఘటన ఎపీలోని కర్నూలు జిల్లాల్లో వెలుగు చూసింది. జైల్లో ఉన్న తల్లి కోసం ఓ తొమ్మిదేళ్ల చిన్నారి.. జైలు బయట వెక్కి వెక్కి ఏడ్చింది. అమ్మ రా... ఒక్కసారైనా బయటికి రా అమ్మ అంటూ ఆ చిన్నారి బోరున ఏడ్చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

కర్నూల్‌లోని మహిళా సబ్ జైలు బయట తొమ్మిదేళ్ల బాలిక ఏడుస్తుండడాన్ని ఓ వ్యక్తి గమనించాడు. ఆ చిన్నారి తన తల్లిని కలవడానికి అనుమతించమని బోరును విలపిస్తోంది. ఆ సంఘటనను మొత్తం వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. తల్లి కోసం కూతురు పడుతున్న ఆ దృశ్యాలు అందరినీ కదిలించేసాయి.
తల్లిని మందలించి జైలు నుంచి విడుదల చేసిన అధికారులు..
కర్నూలులోని ఖాదీజా బీ అనే మహిళ భర్త వదిలెయ్యడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు దొంగగా మారాల్సొచ్చింది. ఓ దొంగతనం కేసులో డిసెంబర్ 12న ఆ మహిళ జైలు పాలైంది. భర్త వదిలేయడంతో కుటుంబ పోషణ భారం అయ్యి, ఆ మహిళ చిన్న చిన్న నేరాలకు పాల్పడింది. ఆమె చేసిన నేరాలకు గాను ఆమెను జైలుకు పంపారు.
In #AndhraPradesh's #Kurnool, Heart wrenching video of a 9 year old girl crying and knocking on the gate of the Kurnool sub jail was recorded by a passerby who was crying to be allowed to meet her mother.
— Hate Detector 🔍 (@HateDetectors) December 17, 2023
Khadija bee (35) a single parent was reportedly jailed on Dec 12 had… pic.twitter.com/LnKzxVd8kR
అయితే, ఆ మహిళా ఖైదుకు ఐదుగురు సంతానం. వారిలో ఒకరే ఈ తొమ్మిదేళ్ల బాలిక. జైలులో ఉన్నకన్నతల్లి కోసం ఆ చిన్నారి పడిన ఆవేదన అంతా ఇంతా కాదు. జైలు బయటే ఉంటూ తల్లి కోసం ఎంతగానో ఏడ్చింది. అయితే, ఈ వీడియో తీసిన వ్యక్తి వెంటనే జైలు సిబ్బందిని కలిసి జరిగిన విషయం చెప్పారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని, బాలికను తన తల్లితో కలవడానికి అనుమతిచ్చారు. ఆ తల్లిని మందలించి జైలు నుంచి విడుదల చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.












Click it and Unblock the Notifications