బహిరంగంగా చంద్రబాబు నిలదీత: జనంలో తిరుగుబాటు- అరెస్టులతో..

Chandrababu Naidu: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు కావస్తోంది. సామాజిక భద్రత కింద పింఛన్లు మినహా మరే పథకం కూడా పెద్దగా అమలు కావట్లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ.

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ, తల్లికి వందనం.. మొదలుకుని- అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామంటూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీలేవీ కార్యాచరణలోకి రావట్లేదు.

A Man arrested after question to CM Chandrababu at Annamayya

మహిళలకు ఉచిత బస్సు హామీ- ఎప్పటికప్పుడు తేదీలు మారుతూ వస్తోందే తప్ప అమలు కావట్లేదు. గత ఏడాది ఆగస్టు 15, ఆ తరువాత సంక్రాంతి పండగ, ఇప్పుడు ఉగాది.. ఇలా ఆర్టీసీ బస్సు స్టాపుల్లాగే ఎక్కడికక్కడ ఆగుతూ వస్తోంది. దీనిపై ప్రభుత్వం ఓ కమిటీ వేయడంతో అక్కడ ఆగింది.

రవాణా శాఖ, మహిళా- శిశు, గిరిజన సంక్షేమం, హమ్ మంత్రులతో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి సమన్వయకుడిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

మెగా డీఎస్సీ, తల్లికి వందనం.. వంటి పథకాల ఊసే ఎత్తట్లేదు చంద్రబాబు సర్కార్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత నోటిఫికేషన్ ఇస్తామంటూ మరోసార వాయిదా పద్దతిని అనుసరించారు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్. ఆ తరువాతైనా అమలులోకి వస్తుందా? అంటే అనుమానమేనంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు సందేహాలు వ్యక్తం చేస్తోన్నారు.

ఈ పరిస్థితుల మధ్య- సంక్షేమ పథకాలపై జనం ప్రశ్నించడం మొదలు పెట్టినట్టే కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు తాజాగా అన్నమయ్య రాయచోటి జిల్లా పర్యటనలో ఇది వెలుగులోకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సంబేపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఓ యువకుడు నేరుగా చంద్రబాబును ప్రశ్నించడం చర్చనీయాంశమైంది.

చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో ఓ యువకుడు పథకాల గురించి నిలదీయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సభాప్రాంగణం నుంచి బయటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరింత వివాదానికి దారి తీసినట్టయింది.

ఇలాంటి అవుట్ డేటెడ్ థింకింగ్ ఉండే కుర్రాళ్లు ఉంటారు కొంతమంది. వాళ్లు చెడగొడతా ఉంటారు. ఇదే పని వీళ్లకు. మనమేమీ చేయలేం. వాళ్ల విధానాలు కూడా ఇట్లే ఉంటాయి.. అంటూ చంద్రబాబు చెప్పడం వినిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+