భర్తతో విడిపోయి మరొకరితో సహజీవనం.. ఆ తర్వాత మరోవ్యక్తితో పరిచయం.. చివరికి హత్య..
సమాజంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. చాలా మంది సహజీవనానికి అలవాటు పడి.. తర్వాత ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ వివాహితను ప్రియుడే హత్య చేసిన ఘటన ఏపీలోని విశాఖపట్నంలో జరిగింది. అయితే ఈ కేసులో నిందితుడు నేరుగా వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. అనకాపల్లి జిల్లా పరవాడకు చెందిన గోపాల్ అనే వ్యక్తి పెయింటింగ్ వేస్తూ ఉపాధి పొందుతున్నాడు.
అతనికి అదే ప్రాంతానికి చెందిన శ్రావణితో పరిచయం ఏర్పడింది. అయితే గతంలోనే శ్రావణికి పెళ్లయింది. ఆమొ కొద్ది రోజులు భర్త కాపురం చేశారు. ఆ తర్వాత గొడవలు జరగడంతో వారు శ్రావణి భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి ఆమె వైజాగ్ లోని జగదాంబ కూడలిలోని ఓ షాపులో పని చేస్తోంది. శ్రావణి షాపుకు దగ్గరలో ఓ రూమ్ అద్దెకు తీసుకుని ఉంటుంది. గోపాల్ పరిచయంతో తర్వాత శ్రావణి అతనితో కలిసి ఉంటుంది. గత ఆరు నెలలుగా గోపాల్, శ్రావణి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.

ఈ క్రమంలో ఓ రోజు గోపాల్ తన స్నేహితుడు వెంకటేష్ ను శ్రావణికి పరిచయం చేశాడు. అయితే వెంకటేష్ శ్రావణిలు మధ్య సన్నిహత్యం బాగా పెరిగింది. శ్రావణి ఎప్పుడూ వెంకటేష్ ఫోన్ మాట్లాడుతుండేది. ఇది గమనించిన గోపాల్ శ్రావణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే ఈ విషయమై మాట్లాడుకుందామని శ్రావణి, గోపాల్, వెంకటేష్ ద్విచక్ర వాహనం పై శక్రవారం సాయింత్రం ఆర్కే బీచ్ కు వెళ్లారు. అయితే అక్కడ పోలీసులు వారిని గమనించి వెళ్లిపోవాలని సూచించారు.
దీంతో వారు సమీపంలోని పాత భవనం వెనక్కి వెళ్లారు. గోపాల్ వెంటటేష్ ను వాటర్ బాటిల్ తేవాలని కోరడంతో అతన బయటకు వెళ్లాడు. గోపాల్ శ్రావణితో వెంకటేష్ ఫోన్ మాట్లాడకూడదని చెప్పాడు. ఈ విషయమై ఇద్దరు మధ్య మాటామాట పెరిగింది. గోపాల్ ఆగ్రహంతో శ్రావణి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఈ మొత్తం ఎపిసోడ్ లో శ్రావణి వ్యవహరశైలి కాస్త భిన్నంగా ఉన్నట్లు అర్థమైంది. భర్తతో విడిపోయిన ఆమె.. గోపాల్ తో సహజీవనం చేస్తోంది. ఆ తర్వాత వెంకటేష్ పరిచయంతో అతని సన్నిహత్యం పెంచుకుంది. గోపాల్ కూడా ఆవేశంతో హత్య చేసి జీవితాన్ని జైలు పాలు చేసుకున్నాడు. వెంకటేష్ స్నేహితుడి ప్రియురాలు అని తెలిసినా ఆమె తరుచూగా ఫోన్ మాట్లాడాడు.












Click it and Unblock the Notifications