అనుమానంతో ప్రియురాలికి వేధింపులు,ప్రియుడిని ఇలా ...
కడప జిల్లాలో ప్రియురాలే ప్రియుడిని హత్య చేసింది.అనుమానం పెంచుకొని ప్రియుడు వేధిస్తుండడంతో తండ్రితో కలిసి ఆమె ప్రియుడిని హత్య చేసింది.
కడప :కడప జిల్లా గొల్లపల్లెకు చెందిన శేఖర్ అనే ఆటో డ్రైవర్ హత్యకు గురయ్యాడు. గోనేసంచిలో శేఖర్ మృతదేహం పోలీసులకు దొరికింది.నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ప్రియురాలే నిందితురాలని తేల్చింది.
కడప జిల్లా గొల్లపల్లెకు చెందిన శేఖర్ కు భార్య , ముగ్గురు పిల్లలున్నారు. శేఖర్ ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు.శేఖర్ .శేఖర్ కు బండివారిపల్లెలో నివాసం ఉంటున్న నీలి భారతితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.
భారతికి కూడ వివాహమైంది. ఆమెకు నంద్యాలకు చెందిన రవికుమార్ తో వివాహమైంది.అయితే రవికుమార్ తో భారతికి విబేధాలు ఏర్పడ్గాయి. ఈ విబేధాల కారణంగా ఆమె భర్తతో దూరంగా తండ్రివద్దే ఉంటోంది.

అయితే శేఖర్ భారతితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడు.కొంత కాలం వారి మద్య సంబందం కొనసాగింది.కాని, శేఖర్ భారతిపై అనుమానం పెంచుకొన్నాడు.దీంతో ఆమెను వేధించడం ప్రారంభించాడు.
ఈ వేదింపులు భరించలేక భారతి శేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు శేఖర్ కు శిక్ష కూడ పడింది.జైలు నుండి వచ్చిన శేఖర్ తిరిగి భారతిని వేధించడం ప్రారంభించాడు.
అయితే శేఖర్ ను హత్య చేయాలని భారతి పథకం వేశారు. ఇంటికి వచ్చిన శేఖర్ ను పథకం ప్రకారంగా రోకలితో కొట్టి చంపేశారు.అనంతరం గోనేసంచిలో శవాన్ని కుక్కి మామిళ్లపల్లె వెళ్ళే రహదారిలో కల్వర్టులో పడేసి యాసిడ్ పోయడంతో పాటు పెట్రోల్ పోసి అంటించారు.
అయితే అది పూర్తిగా కాలిపోలేదు. దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణ చేసి పోలీసులు భారతిని, ఆమె తండ్రిని అరెస్టు చేశారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications